ప్రజలు మళ్లీ కెసిఆర్‌ సిఎం కావాలంటున్నారు

ప్రచారంలో టిఆర్‌ఎస్‌ దూసుకుని పోతోంది
ఎక్కడికి వెళ్లినా ప్రజలు అభిమానంతో స్వాగతిస్తున్నారు
అధినేతతో భేటీలో అన్నీ వివరిస్తాం: మంత్రి తుమ్మల
ఖమ్మం,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): నాలుగేళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ధి వల్ల ప్రజలు మళ్లీ ఆయన్ను ముఖ్యమంత్రి చేయడానికి సంసిద్దంగా ఉన్నారని,ప్రచార సరళి చూస్తుంటే భారీ మెజార్టీతో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయఢంకా మోగిస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని స్థానాలను టిఆర్‌ఎస్‌ గెల్చుకోబోతోందని అన్నారు. ముందుగానే టిక్కెట్లను ప్రకటించడంతో ప్రజలకు చేరువయ్యామని అన్నారు. ప్రజలు అభివృద్దిని కోరుకుంటున్నారని, టిఆర్‌ఎస్‌ చేపట్టిన కార్యక్రమాలపై చర్చించుకుంటున్నారని శనివారం నాడిక్కడ అన్నారు.మహాకూటమికి ఈ ఎన్‌ఇనకల్లో భంగపాటు తప్పదని అన్నారు. వారు తమనుతాము అతిగా ఊహించుకుంటున్నారని అన్నారు. ఎన్నికల రణక్షేత్రంలో  అంతిమ విజయం తమదేనని అన్నారు. కెసిఆర్‌ సవిూక్షలో ప్రతి ఒక్క అభ్యర్థి తమ అనుభవాలను వివరిస్తారని అన్నారు దాదాపు అన్ని నియోజవర్గాల్లో కూడా ప్రచారం దూకుడుగా సాగిందని, ప్రజలే తమకు ఎదురు వచ్చి స్వాగతం పలుకుతున్న తీరు అమోఘమన్నారు.  టిఆర్‌ఎస్‌ అభివృద్దిని  దెబ్బకొట్టేందుకు అనేక రాజకీయ పార్టీలు ఏకమై వస్తున్నాయన్న విషయం ప్రజలకు కూడా బాగా తెలిసి పోయిందన్నారు. రాష్ట్రాన్ని దగా చేసిన, అసరమర్థ, అవినీతి పాలనను అందించిన కాంగ్రెస్‌ పార్టీ కుట్రలతో మళ్లీ ముందుకొస్తుందని, ఆ పార్టీ కూటమిని కూకటివేళ్లతో పెకిలించి మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తామని  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని సీట్లను గెలిపించి ఆయనకు కానుకగా అందిస్తామని అన్నారు.  ఇప్పటికే ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్‌, టీడీపీల నుంచి వేలాది మంది టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. దీంతో జిల్లాలో ఈ రెండు పార్టీలు దాదాపు ఖాళీ అయినట్లేనని తుమ్మల
వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ఎక్కడికి వెళ్లినా  కార్యకర్తలు డప్పువాయిద్యాలతో, పూలవర్షం కురిపిస్తు ఘనస్వాగతం పలుకుతున్న తీరు తమపట్ల అభిమానం చాటుతోందని అన్నారు. ప్రభుత్వం అన్ని కులాల వారికి ఇంటింటికి సహాయాన్ని అందిస్తుందన్నారు. ఇకపతో పాలేరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్‌వన్‌గా ఉంచడమే తన లక్ష్యమని మంత్రి తెలిపారు.  పాలేరులో ఏకష్టం, నష్టం ఉన్నప్పటికీ తప్పకుండా పనులు చేయాలని గత రెండు సంవత్సరాలుగా యజ్ఞంలాగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇంటింటికి భగిరథ నీరు, కాకతీయ ద్వారా చెరువుల అభివృద్ధి జరిగింది. రైతులకు రైతుబంధు, రైతుబీమాతో సంతోషంగా ఉన్నారు, వృద్ధులకు వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఆసరాతో సంతోషంగా బతకగలుగుతున్నారు. నిరంతరం కరెంటును, నీళ్లను ఇచ్చిన వ్యక్తిని, అభివృద్ధిని చేసిన వ్యక్తిని మళ్లీ సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సత్తుపల్లిని ఏవిధంగా అభివృద్ధి చేశానో, రానున్న రోజుల్లో పాలేరు నియోజకవర్గాన్ని కూడా అదే విధంగా తీర్చిదిద్దుతాన్నారు.