ప్రజలు శాంతియుతంగా మెలగాలి.

 

 

 

 

 

 

 

 

భైంసా నూతన ఏఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్.భైంసా రూరల్ జనవరి 31 జనం సాక్షిప్రజలందరూ ఇల్లీగల్ యాక్టివిటీస్ కి దూరంగా ఉండాలని పోలీసులకు సహకరించి శాంతిభద్రతలకు అఘాతం కలిగించద్దని భైంసా పట్టణ నూతన ఏఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ అన్నారు. గ్రేహౌండ్స్ ఏఎస్పీగా విధులు నిర్వహించిన పాటిల్ కాంతిలాల్ మంగళవారం బైంసా పట్టణ నూతన ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టి మాట్లాడారు… ప్రజలందరూ ఒకరికి ఒకరు సహకరించుకోవాలని ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా వుండి, మతసామరస్యాన్ని పాటించాలని, ఎవరైనా ఇల్లీగల్ కార్యక్రమాలకు పాల్పడితే వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులు పోలీసుల చేతుల నుండి తప్పించుకోలేరని సూచించారు. భైంసా పట్టణ సీఐ, స్టేషన్ సిబ్బంది నూతన బాధ్యతలు స్వీకరించిన ఏఎస్పీకి పుష్పగుచ్చాన్ని ఇచ్చి స్వాగతించారు. గతంలో ఏఎస్పీగా పని చేసినటువంటి కిరణ్ ప్రభాకర్ కారే హైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ గా బదిలీపై వెళ్లారు.