ప్రజా సేవే లక్ష్యంగా పనులు చేసా

మరోమారు ఆశీర్వదించాలి: పద్మాదేవేందర్‌ రెడ్డి
మెదక్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ప్రజలకు సేవచేయడమే తన జీవిత లక్ష్యమని మాజీ  డిప్యూటి స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలే పాలకులని వారి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తూ ముందుకెళ్తానన్నారు. . ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు నేరుగా అర్హులకే అందివ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.మహిళలు ఆర్థికంగా అభివృద్‌ధ్ది చెందడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. ఒకప్పుడు ఆడపిల్లలంటే భయపడే తల్లిదండ్రులు నేడు సమాజంలో గౌరవంగా బతుకు తున్నారన్నారు. ఆడపిల్ల భారం కాకుడదనే ఉద్దేశంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టామన్నారు.  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మా దేవేందర్‌ రెడ్డి గణెళిశ్‌ నిమజ్జనంలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో నిమజ్జనం సందర్భంగా  రాందాస్‌ చౌరస్తా దగ్గర నిమజ్జనానికి వెళ్తున్న గణనాథులకు పద్మాదేవేందర్‌ రెడ్డి స్వాగతం పలికారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. గత పాలకులు పక్షపాత ధోరణితో అనాడు రైతు ఆత్మహత్యలు జరగడం బాధాకరం అన్నారు. సాగునీటి రంగాన్ని అభివృద్ది చేసి రైతు ఆత్మహత్యలు లేని ఆదర్శ రాష్ట్రంగా మార్చడానికి సీఎం కేసిఆర్‌ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల వల్ల గ్రామాలు అభివృద్ది చెందలేని అన్నారు. తంలో ఎవరూ చేయని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. చేయ్యడం జరిగిందన్నారు.