ప్రణయ్‌ హత్య కేసులో కోటి డీల్‌

 

 

 

 

18 లక్షల అడ్వాన్స్‌తో సుపారీ

హత్య చేసింది బీహార్‌కు చెందిన శర్మ

వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ

నల్గొండ,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రణయ్‌ హత్య కేసు లో మొత్తం ఏడుగురు నిందితులు ఉన్నారని ఎస్పీ రంగనాథ్‌ స్పష్టంచేశారు. మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ఈ హత్యకు సంబంధించి మొత్తం కోటి రూపాయల డీల్‌ జరిగినట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా 18 లక్షలు అడ్వాన్స్‌గా

తీసుకున్నట్లు తెలిపాడు. నల్గొండ గ్యాంగ్‌ తో కలిసి బీహార్‌ గ్యాంగ్‌ సుపారీ తీసున్నారని వివరించారు. దీనిలో భాగమైన మొత్తం ఏడుగురిని అరెస్ట్‌ చేశామని తెలిపారు. వీరితో పాటు నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే వీరేశంని కూడా విచారిస్తామని అన్నారు. నల్గొండ కి చెందిన మాజీ ఐసిస్‌ టెర్రరిస్ట్‌ లు ప్రణయ్‌ హత్య కేసు లో ఇన్వాల్వ్‌ అయ్యారని, ప్రణయ్‌ను చంపిన వాడు బీహార్‌కు చెందినవాడని తెలిపారు.

పట్టపగలు అందరూ చూస్తుండగానే మిర్యాలగూడలో గుర్తు తెలియని దుండగులు శుక్రవారం పెరుమాళ్ళ ప్రణయ్‌(25) అనే యువకుడిని అత్యంత కిరాతకంగా నరికి చంపేసిన సంగతి తెలిసిందే. అయితే, ప్రణయ్‌ హత్య కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. గురువు అస్గర్‌ అలీతో ప్రణయ్‌ను హత్య చేయించాడు బారి. హత్యలో పాల్గొన్నది మాత్రం బీహార్‌ రాష్ట్రంలోని సంస్థాన్‌ పూర్‌ జిల్లా వాసి అయిన శర్మ. హత్య జరిగిన రోజు అస్గర్‌ అలీ ఆస్పత్రికి వచ్చాడు. ప్రణయ్‌ హత్యకు అక్షరాల కోటి రూపాయల డీల్‌ జరిగింది. ఇప్పటి వరకు ఈ హత్యకు సంబంధించిన ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ్‌ గ్యాంగ్‌ తో కలిసి బీహారి బ్యాచ్‌ సుపారీ తీసుకున్నారు. నల్గొండకు చెందిన మాజీ ఐసిస్‌ టెర్రరిస్టులకు హత్య కేసులో సంబంధం ఉందన్నారు. అలాగే నకిరేకల్‌ మాజీ ఎంఎల్‌ఎ వేముల వీరేశంను కూడా విచారించ నున్నట్లు తెలిపారు. ఇక హత్య కేసులో కీలక నిందితుడు శర్మను పోలీసులు బీహార్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతడిని సమస్థీపూర్‌ కోర్టులో హాజరుపర్చి నల్గొండకు తరలిస్తున్నారు. తరవాత మిర్యాలగూడ కోర్టులో శర్మను హాజరుపర్చనున్నారు.