ప్రతిపక్షాలపై ధ్వజమెత్తిన మోడీ

గుజరాత్ లో  ప్రధానమంత్రి  నరేంద్రమోదీ  ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. లోక్ సభలో మాట్లాడనివ్వడంలేదనీ అందుకే తను జనసభలో మాట్లాడుతున్నానంటూ పార్లమెంటులో  ప్రతిపక్షాల చేస్తున్న ఆందోళనపై   విరుచుకుపడ్డారు. పేద‌ల వికాసం కోస‌మే పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా, నల్ల డబ్బు కు వ్యతిరేకంగా, నకిలీ కరెన్సీకి వ్యతిరేకంగా  పోరాటం చేస్తున్నట్టు మోదీ చెప్పారు. గుజ‌రాత్‌లో  దీసాలో శనివారం  ఓ స‌భ‌లో మోదీ  పెద్ద నోట్ల రద్దును  పూర్తిగా సమర్థించుకన్నారు.  దేశాన్ని ప‌ట్టిపీడిస్తోన్న న‌ల్లధ‌నాన్ని నియంత్రించడానికే  ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నల్లధనంపైmann-ki-baat-government-constructing-5-lakh-farming-pools-says-pm-narendra-modi పోరులో  50  రోజులు గడువు అడిగాం.. ఇపుడు ఎలాంటి మార్పులు వస్తున్నాయో మీరు చూస్తున్నారని  మోదీ చెప్పారు.  నకిలీ కరెన్సీని, అవినీతిని దేశం ఎట్టి పరిస్తితుల్లోనూ సహించదు. ఈ విషయంలో   మీ దీవెనలు  కావాలంటూ  ప్రజలనుద్దేశించి మోదీ కోరారు.  ఇపుడు ప్రజల శక్తి బలం పెరుగుతోంది. రూ.100నోట్లను సరఫరాను పెంచామంటూ ప్రధాని ప్రసంగిచారు.