ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు

అండగి దుకాణాలకు సునీత శంకుస్థాపన

యాదాద్రి భువనగిరి,జూలై25(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరి సంక్షేమానికి పాటుపడుతోందని

ప్రభుత్వ విప్‌ గొంగడి సునీత అన్నారు. చిరు వ్యాపారులకు అండగా నిలుస్తోందిన అన్నారు. బుదశారం యాదగిరి పట్టణంలో పర్యటించిన ఆమె స్థానికంగా నిర్మించ తలపెట్టిన గ్రావిూణ అంగడి దుకాణాల సముదాయానికి శంకుస్థాపన చేశారు. సుమారు రూ. 15 లక్షలతో భవనాన్ని నిర్మిస్తున్నారు. అదేవిధంగా యాదగిరి పట్టణంలో అంగడిలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అభివృద్ది సంక్షేమ ఫలాలు అందేలా చేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దని అన్నారు. ప్రతి ఇంటికో మొక్కను తప్పనిసరిగా నాటి మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. నాల్గో విడుత చేపట్టే హరితహారం కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు. ఎక్కడైతే నిరుపయోగంగా ఎలాంటి సేద్యం చేయని భూముల్లో మొక్కలు పెంచితే పర్యావరణ సమతుల్యతను కాపాడినవారం అవుతామని పర్యావరణాన్ని రక్షించాల్సి నైతిక భాద్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఆయన తెలిపారు. పాఠశాలలో, పంచాయతీ అధికారి గ్రామ పంచాయతీలలో, ప్రభుత్వ కార్యాలయాలలో ప్రతి మండలంలో మొక్కలు నాటాలని తెలిపారు. మండల అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చి హరితహారం కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్‌, వ్యాపారులు పాల్గొన్నారు.