ప్రభుత్వ ఆస్పత్రులలోనే ప్రసవాలు జరగాలి

డీఎంహెచ్‌ఓ శ్రీధర్‌
జగిత్యాల,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): గర్భిణులు ప్రైవేటు దవాఖానలను ఆశ్రయించి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోవద్దని జిల్లా వైద్యాధికారి శ్రీధర్‌ అన్నారు.ప్రభుత్వం గర్భిణుల కోసం అనేక రకాలుగా పథకాలతో ఆదుకుంటోందని అన్నారు. అలాగే ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోందని అన్నారు. గర్భిణులకు మెరుగైన సేవలందిస్తూ, ప్రభుత్వ దవాఖానాల్లోనే ప్రసవించేలా పోత్సహించాలని సూచించారు.  ఇటీవల పలు ఆస్పత్రలును సందర్శించి ప్రసూతి మహిళలతో మాట్లాడి అందుతున్న సేవల గురించి తెలుసుకున్నా రు. అర్హులైన బాలింతలకు కేసీఆర్‌ కిట్లను అందజేశారు.  ప్రభుత్వ దవాఖానాల్లోనే మెరుగైన సేవలు అందుతున్నాయనీ, సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ దవాఖాన సేవలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు ఇతరకుల కూడా తెలియచేయాలన్నారు.  గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించాలన్నారు.