ప్రభుత్వ భూముల లెక్క తేల్చండి.

– కోబోయాప్ లో చేర్చండి.
– తహసీల్దార్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ హన్మంతరావు.
సంగారెడ్డి బ్యూరో  నవంబర్ 25:(జనం సాక్షి):  తహసీల్దార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రభుత్వ  భూముల వివరాలు సేకరించి కోబో యాప్ లో వివరాలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఏం.హనుమంత రావు సూచించాయారు.  చాల ప్రాంతాలలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం మవుతున్నాయని తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఒక ఉద్యమంలా భూముల గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు. సోమవారం  కలెక్టరేట్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్.డి.ఓ.లు,  తహసీల్దార్లు, మండల పరిషద్ అభివృద్ధి అధికారులు, మండల అధికారులు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ  భూముల వివరాల నమోదుకు ప్రత్యేకంగా కోబో యాప్ ను రూపొందించామని, ఆ యాప్ ను స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకొని నిర్దేశించిన ఫార్మటు లో ప్రభుత్వ భూముల వివరాలు నమోదు చేయాలని అన్నారు. ప్రధానంగా అన్యాక్రాంతమైన భూమి విస్తీర్ణం, సర్వే నెంబర్ తో పాటు ఫోటో తీసి అప్ లోడ్ చేయాలని అన్నారు. తహసీల్దార్లు, ఉప తహసిల్దార్లు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు  ఒక బృందంగా ఏర్పడి అన్యాక్రాంతమైన భూములను, ఎఫ్.టి.ఎల్ లను పరిశీలించి  తగు చర్య తీసుకోవాలని అన్నారు. అలాగే నాలా బదలాయిపు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అన్నారు. హసీల్దార్లు, ఉప తహసిల్దార్లు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు  ఒక బృందంగా ఏర్పడి అన్యాక్రాంతమైన భూములను, ఎఫ్.టి.ఎల్ లను పరిశీలించి  తగు చర్య తీసుకోవాలని అన్నారు. అలాగే నాలా బదలాయిపు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అన్నారు.  పంచాయత్ రాజ్ కొత్త చట్టం వచ్చిన తరువాత అనుమతి లేకుండా లే  అవుట్ లు  చేసిన  వాటికి  ముందుగా నోటీసులు ఇచ్చిన  తరువాత   రోడ్లు, డ్రైనేజీ ఆ తరువాత నిర్మాణ పనులను తొలగించాలని  అవసరమైతే పొలిసు బందోబస్తు ఇస్తామని  కలెక్టర్ తెలిపారు.  ప్రధానంగా పఠాన్ చేరు, అమీనాపూర్ ప్రాంతాలలో ఈ విధమైన లే  అవుట్  లు ఉన్నాయని, సర్పంచులు, వార్డు సభ్యులు వీటి తొలగింపునకు చర్యలు తీసుకోవాలని లేనిచో వారిపై చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు. వైకుంఠ ధామాల ప్రగతిని సమీక్షిస్తూ ఈ నెలాఖరునాటికి అన్ని పనులు ప్రారంభమై పునాది స్థాయికి రావాలని, పల్లె ప్రగతిలో భాగంగా   ఇప్పటివరకు జిల్లాలో  120 ట్రాక్టర్లు కొనుగోలు చేసి గ్రామ పంచాయతీలకు అందించామని అన్నారు.  ఇండియన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, గ్రామీణ వికాస్ బ్యాంకు లు ట్రాక్టర్ ల కొనుగోలుకు రుణాలు అందించుటకు ముందుకొచ్చాయని, సర్పంచులు 35 శాతం గ్రామ పంచాయతీ నిధులు సమకూర్చుకొని మిగతా 65 శాతం బ్యాంకు ఋణం కొరకు డాక్యుమెంట్లు తయారు చేసుకొని సంబంధిత బ్యాంక్ అధికారులను సంప్రదించవలసినదిగా కలెక్టర్ సూచించారు. గ్రామ పంచాయతీలలో ఆస్తి పన్ను రాబట్టుటకు డిమాండ్ నోటీసులు ఇచ్చి డిసెంబర్ 1 నుండి రెండు మాసాలలోగా  వంద శాతం పన్ను రాబట్టే  విధంగా కృషి చేయాలని, 35 నుండి 40 కోట్ల రూపాయలు పన్ను రూపంలో వచ్చే అవకాశముందని కలెక్టర్ తెలిపారు.  డిసెంబర్ 15 నాటికి నిర్మాణాలు పూర్తి కావాలన్నారు. అదేవిధంగా డంప్ యార్డులు, ఇంకుడు గుంతల నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. అదేవిధంగా నర్సరీలు ఏర్పాటు చేయాలని, త్వరలో విత్తనాలు అందజేస్తామని అన్నారు.
   ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  సహాయ కలెక్టర్ ట్రైనీ జీతిష్  వి.పాటిల్, ఆర్.డి.ఓ. శ్రీను, డి.ఆర్.డి.ఓ. శ్రీనివాసులు, జిల్లా పంచాయత్ అధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు, మండల పరిషద్ అభివృద్ధి అధికారులు, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.