ప్రమాద సమయంలో..  కారు నడిపింది నేనే


– సీటు బెల్ట్‌ పెట్టుకోవటంవల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు
– ట్వీటర్‌లో సినీనటుడు రాజ్‌ తరుణ్‌
హైదరాబాద్‌, ఆగస్టు 21 (జనంసాక్షి):   మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్‌ టౌన్‌షిప్‌కి వంద అడుగుల రహదారి మలుపువద్ద గతంలో ఒక కారు ఢీకొని నుజ్జునుజ్జయిన విషయం తెలిసిందే. ఈ కారులో
ప్రయాణించింది సినీ హీరో రాజ్‌తరుణ్‌ అని పోలీసులు గుర్తించారు. కాగా కారు ప్రమాదం అనంతరం ఆయన అక్కడి నుండి వెళ్లిపోవడం సీసీ కెమెరాల్లో రికార్డైంది. రాజ్‌తరుణ్‌కి సంబంధించి సోషల్‌ విూడియాలో జోరుగా చర్చ నడుస్తున్న క్రమంలో ఆయన తన ట్విట్టర్‌ ద్వారా స్పందించాడు. ప్రమాదం జరిగిన తర్వాత నేను సేఫ్‌గా ఉన్నానా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ తెలిపారు. గత మూడు నెలలుగా నార్సింగ్‌ సర్కిల్‌లో చాలా యాక్సిడెంట్స్‌ జరగుతూ వచ్చాయని, ఆ స్పాట్‌ నుండే నేను వస్తుండగా, హఠాత్తుగా వచ్చిన మలుపు గమనించక పోవడం వలన సడెన్‌గా కారు స్టీరింగ్‌ని కుడివైపుకి తిప్పానని రాజ్‌తరుణ్‌ అన్నారు. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన గోడని ఢీకొందని, ఆ సమయంలో నా చెవులు బ్లాక్‌ అయ్యాయని, కళ్ళు బయర్లు కమ్మాయని, గుండె వేగం పెరిగిందని అన్నారు. సీటు బెల్ట్‌ పెట్టుకోవడం వలన నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, హఠాత్‌ పరిణామంతో షాక్‌ కి గురైన నేను, తేరుకొని పరుగున నార్సింగ్‌ సర్కిల్‌ నుండి ఇంటికి చేరానని, .ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నానని ట్వీటర్‌లో తెలిపారు. కొద్ది రోజులలో నా పనులతో బిజీ అవుతానని, విూ ప్రేమకి నేను ధన్యుడిని అని పేర్కొంటూ రాజ్‌తరుణ్‌ ట్వీట్‌ చేశారు. ఇదిలాఉంటే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు