ప్రశాంత ఎన్నికలకు పక్కా చర్యలు

సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా

ఎస్పీ రెమారాజేశ్వరి

మ‌హబూబ్‌నగర్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి):అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌సి రెమారాజేశ్వరి తెలిపారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో వారు ఎలాంటి గొడవలకు దిగినా కేసు నమోదుతో పాటు కఠిన చర్యలు ఉంటాయన్నారు. అతి సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘాతో పాటు అధిక బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల్లో గొడవలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గ్రామాల్లో కార్డెన్‌ సెర్చ్‌లు మొదలు పెట్టామని తెలిపారు. సమస్యలుంటే నేరుగా పోలీసుల సాయం తీసుకోవాలన్నారు. ఎన్నికల్లో మద్యం, డబ్బులు సరఫరా గాకుండా పలు చోట్ల పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు, చెప్పారు. నిరంతర నిఘా కోసం పెట్రోలింగ్‌ను పెంచడం, ప్లయింగ్‌ స్కాడ్‌ల ఏర్పాటు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలిసీతెలియక నేరాలకు, చట్టవ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. రానున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు గానూ పోలీసుశాఖ కట్టదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసిందని, మనదైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యత నిర్వర్తించవలసిన అవసరం ఉన్నదని తెలిపారు. ముఖ్యంగా గతంలో నేరచరిత్ర ఉన్న వారిపట్ల ఆకర్షితులు కాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వివిధ రకాలుగా ఆధునిక పరిజ్ఞానంతో ఉన్న పోలీసు నిఘా

వర్గాలు విస్తృతమైన దృష్టితో ఉంటాయని, ఎవరూ తప్పించుకోలేరని ఎస్పీ పేర్కొన్నారు.