ప్లాస్టిక్‌ను నిషేధించండి.. భవష్యత్‌ను కాపాడండి

డస్ట్‌ బిన్గా మారి యువకుడు వినూత్న ప్రచారం
విద్యార్థుల్లో చైతన్యం కల్పిస్తున్న బిష్ణు భగత్‌
భువనేశ్వర్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): పాలిథీన్‌ బ్యాగులను నిషేధించి పర్యావరణం, భవిష్యత్‌ తరాలను కాపాడుకుందామని ఓ యువకుడు డస్ట్‌ బిన్‌ గా మారి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. ఒడిశాలోని
మయూర్‌ భంజ్‌ కు చెందిన బిష్ణు భగత్‌(36) డస్ట్‌ బిన్‌ రూపంలో బట్టలు ధరించి.. పాలిథీన్‌ వల్ల పర్యావరణానికి జరిగే నష్టంపై అవగాహన కల్పిస్తున్నాడు. తను ధరించిన బట్టలపై.. భవిష్యత్‌ ను కాపాడండి, పాలిథీన్‌ బ్యాగులను ఉపయోగించకండి అని రాసి ఉంచాడు. ఈ విధంగా పాఠశాలలు, పబ్లిక్‌ ప్లేస్‌ లలో భగత్‌ అవగాహన కల్పిస్తూ చైతన్యం తీసుకువస్తున్నాడు. భగత్‌ చేస్తున్న ప్రచారంపై పాఠశాల విద్యార్థుల్లో పెద్ద మార్పు వచ్చింది. భగత్‌ నుంచి ఎంతో నేర్చుకున్నామని ఈ క్షణం నుంచే పాలిథీన్‌ ను వాడొద్దని తమ కుటుంబ సభ్యులకు, బంధువులకు చెప్పి మార్పు తీసుకొస్తామని విద్యార్థులు ప్రతిన బూనుతున్నారు.