ఫీల్డింగ్‌లో మనమే ద బెస్ట్‌! 

– భారత్‌జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌
న్యూఢిల్లీ, నవంబర్‌11(జ‌నంసాక్షి) : ‘మైదానంలో భారత క్రికెటర్లు అద్భుతంగా ఫీల్డింగ్‌ చేస్తున్నారని,  ప్రపంచంలోని అన్ని క్రికెట్‌ జట్లతో పోలిస్తే మనమే ఫీల్డింగ్‌లో బెస్ట్‌గా ఉన్నామని  భారత క్రికెట్‌ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ అన్నారు. శ్రీధర్‌ మాట్లాడుతూ.. మన జట్టు ఆటగాళ్ల గ్రౌండ్‌ ఫీల్డింగ్‌ చాలా బాగుందని, ఈ విషయంలో ప్రపంచంలోనే మనమే ద బెస్ట్‌గా ఉన్నామని తెలిపారు. ఐపీఎల్‌లో ఫీల్డింగ్‌కు చాలా ప్రాధాన్యం ఉందని, ప్రత్యర్థి జట్టును పరుగులు చేయకుండా కట్టడి చేసేందుకు సదరు జట్టు సారథి మైదానంలో ఫీల్డర్లను ఎక్కువసార్లు ప్రదేశాలు మారుస్తూ ఉంటాడు. దీని ద్వారానే మన ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో చాలా మెరుగయ్యారన్నారు. తద్వారా ఫిట్‌నెస్‌ కూడా కాపాడుకోగలుగుతున్నారు. ఈ రోజుల్లో 8ఓవర్ల క్రికెట్‌ మ్యాచ్‌లో సైతం ఫీల్డర్లే మ్యాచ్‌ను మలుపు తిప్పగలరని,  టెస్టు క్రికెట్‌లో ఒక ఆటగాడు ఒకే ప్రదేశంలో ఎక్కువ సమయం ఫీల్డింగ్‌ చేయాల్సి ఉంటుందని, కోచ్‌గా నా బాధ్యత ఆటగాళ్లు చేసే తప్పులు గుర్తించి వారికి చెప్పడమేన్నారు. ఫాస్ట్‌ బౌలర్లు అయిన ఉమేశ్‌ యాదవ్‌, బుమ్రా, షమి, భువనేశ్వర్‌ ఫీల్డింగ్‌లో మరింతగా రాణిస్తున్నారు’ అని తెలిపారు.