బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం పురోగతి

అనేక పథకాలతో ముందున్న రాష్ట్రం

అన్ని పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి

వరంగల్‌ స్వాతంత్య్ర వేడుకల్లో కడియం

వరంగల్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): భారతస్వాతంత్యద్రినోత్సవం మనందరికి గొప్ప పండగరోజని, పరాయిపాలన నుంచి స్వయంపాలన పొందిన చారిత్రక రోజు అని డిప్యూటి సిఎం కడియం శ్రీహరి అన్నారు. 72వ స్వాతంత్రదినోత్సవం సందర్భంగాజిల్లాప్రజలకు, ప్రజాప్రతినిధులకు, స్వాతంత్య సమరయోధులకు, అధికారులకు, తెలంగాణఉద్యమకారులకు, మేధావులకు, విద్యార్ధిని, విద్యార్ధులకు ,విూడియా మిత్రులకు స్వాతంత్యద్రినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్య భారత దేశంలో తెలంగాణ ప్రాంతం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిందని,. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆరు దశాబ్దాలు ఉద్యమించిందన్నారు. ఈ ఉద్యమంలో మలిదశ పోరాటం కేసిఆర్‌ నాయకత్వంలో ఫలించి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణరాష్టాన్ని బంగారు తెలంగాణగా మార్చే లక్ష్యంతో అన్ని వర్గాల వాళ్ల సమగ్ర వికాసం కోసం సిఎం కేసిఆర్‌ వినూత్న పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.మన రాష్ట్రంలో అమలవుతున్న అనేక పథకాలు నేడుదేశ, విదేశాల్లోనిప్రముఖులప్రశంసలు పొందుతున్నాయన్నారు. వ్యవసాయం, విద్యుత్‌, విద్య, వైద్యం, సాగుమరియుతాగునీరు, పరిశ్రమలు, ఐ.టి. రంగాలలో తెలంగాణ దేశంలోనే తన ప్రత్యేకతను చాటుకుంటూ పలురికార్డులనుసొంతంచేసుకుంది. దేశంలోని ఇతరరాష్ట్రాలు పథకాలను అధ్యయనంచేసి వారి దగ్గర అమలుచేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేయాలని, రైతును రాజును చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వంలో అమలవుతున్న పథకాలు నేడు రైతు ముఖంలో చిరునవ్వును చిందిస్తున్నాయి. దండగ అన్న వ్యవసాయాన్ని పండగ చేసి చూపుతున్న చేతల ప్రభుత్వం మనది. వలసలునివారించి,పేదరికాన్నినిర్మూలించిచేతివృత్తులు,

కులవృత్తులు, కుటుంబపరిశ్రమలకుజీవంపోయాలనిప్రభుత్వం ఆశయం ఆచరణలో మన కళ్లముందు కనిపిస్తుంది.రైతుల ఆత్మహత్యలకు అప్పులే కారణమని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలోరుణమాఫీ హావిూ ఇచ్చింది. ఇచ్చిన మాట మేరకు 17వేలకోట్లరూపాయల అప్పులను 4దఫాలుగామాఫిచేసి 35 లక్షలమందిరైతులనురుణవిముక్తంచేసింది.తెలంగాణలోఎరువులు, విత్తనాలకోసం రైతులకుపడిగాపులఅవసరంలేకుండానాణ్యమైనవిత్తనాలు, రువులుఅందుబాటులోఉంచాం.గతప్రభుత్వాల్లో విద్యుత్‌ఎప్పుడువస్తుందో, రాదోతెలియనిపరిస్థితిని మార్చి తెలంగాణలో నిరంతర విద్యుత్‌ సాధించాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం అని వివరించారు.

రైతుబంధు పథకం

పంట పెట్టుబడికి అప్పుకోసం చేతులుసాచే పరిస్థితిని మార్చాలనుకున్న సిఎం కెసిఆర్‌ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుకు పంటపెట్టుబడి ఇచ్చే రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చారు. ఈపథకం కింద ఎకరాకు ఏటా ఎనిమిదివేల రూపాయలు పంట పెట్టు బడిప్రకటించారు. మొదటి విడతలో ఎకరానికి 4000 రూపాయల చొప్పున రాష్ట్రంలోని50.08లక్షలమందిరైతులకు5,164కోట్లరూపాయలుపంటపెట్టుబడికింద పంపిణీ చేసుకున్నాం. భూతగాదాలకు ప్రధాన కారణం భూరికార్డుల్లోని లోపాలేనని గుర్తించిన సిఎం కేసిఆర్‌ వాటినిసమూలంగాప్రక్షాళనచేయాలనిసాహసోపేతనిర్ణయంతీసుకొన్నారు. రాష్ట్రంలోని భూరికార్డులను వందరోజులలోనే 96 శాతం ప్రక్షాళనచేసి రికార్డుసృష్టించారు. రాష్ట్రంలోని 2 కోట్ల 38 లక్షల ఎకరాల భూమికి సంబంధించి రికార్డులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి కోటి56లక్షల ఎకరాల వ్యవసాయ భూమి వివరాలలో స్పష్టత తీసుకురావడం జరిగింది. కోటి 40 లక్షల ఎకరాల భూములకు పట్టాదార్‌ పుస్తకాలు ఇచ్చారు. 2271రూపాయలచొప్పునప్రీమియంచెల్లించిరాష్ట్రంలో 27 లక్షలమంది రైతులకు జిల్లాలొ 43 వేల 510 మందిరైతులకు రైతుబీమాపథకం కింద బీమా పత్రాలనుఅందజేయడంజరుగుతుంది. ప్రమాదవశాత్తురైతుచనిపోయిన 10 రోజులలోనే 5 లక్షల రూపాయలు కుటుంబసభ్యులకు బీమాకంపెనిచెల్లించేవిధంగాచర్యలు తీసుకున్నాం.

సాగునీటిప్రాజెక్టులు

ప్రాజెక్టులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి రాష్ట్రంలోని కోటిఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంతో ప్రాజెక్టులనురీ-డిజైనింగ్చేసిరాష్ట్రంలోని 23 భారీ, 13 మధ్యతరహా ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికనకొనసాగించడంజరుగుతున్నది. ఇందులోభాగంగాపూర్వపువరంగల్జిల్లాలో 10 లక్షలఎకరాలకుసాగునీరుఅందించాలనిఏకైకలక్ష్యంతోఎస్సారెస్సీ మరియుదేవాదులప్రాజెక్టుమొదటి, రెండు, మూడోవిడతపనులనుత్వరితగతినపూర్తిచేయడంతోపాటుప్రాజెక్టుక్రిందఉన్నరిజర్వాయర్లను పూర్తి చేయడం జరిగింది. 10.78 టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతోలింగంపల్లిప్రాజెక్టునిర్మాణం కోసంరాష్ట్రప్రభుత్వం 3227 కోట్లరూపాయలపరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం టెండర్లు పిలవడం జరిగింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే 10 లక్షల ఎకరాలకు సాగునీరు, వరంగల్‌ పట్టణానికి తాగునీరు అందించడానికి మార్గం సుగమం అవుతుంది.

గోదావరినదిపైమరొక మానవనిర్మిత అద్భుతంకాళేశ్వరంప్రాజెక్టు అన్నారు. గత పాలనలో నిర్లక్ష్యానికి గురైన చెరువులను పునరుద్ధరించి, తెలంగాణలోని గొలుసుచెరువులకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో చేపట్టిన మిషన్‌ కాకతీయ దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు పొందింది. రాష్ట్రంలోని 46 వేలచెరువులనుపునరుద్ధరించేందుకు గత నాలుగు విడుతలు పూర్తి చేసి ఐదో విడత పనులు

జరుగుతున్నాయి.

హరితహారంతో మొక్కల పెంపకం

అంతరించి పోతున్నఅటవీసంపదనుపెంపొందించివాతావరణసమతుల్యతనుకాపాడి, భావితరాల మంచి భవిష్యత్‌ ఇవ్వాలనే గొప్ప లక్ష్యంతో సిఎం కేసిఆర్‌ రూపొందించిన మరొక మంచి పథకం హరితహారం. ప్రస్తుతంఉన్న 24 శాతంఅటవీసంపదను 33 శాతానికిపెంపొందించుటకు 230 కోట్లమొక్కలు నాటాలని లక్ష్యంతోగత మూడు విడతలుగా 81.60 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. నాల్గవ విడతలో 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నాం. వరంగల్‌అర్బన్జిల్లాలోఈసంవత్సరం 62 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాం. నాటినప్రతిమొక్కనుసంరక్షించేబాధ్యత అందరూ తీసుకోవాలి. సామాజికఅడవులపెంపకానికిఅత్యంతప్రాధాన్యతనిచ్చిమొక్కలునాటేవిధంగాచర్యలుతీసుకుంటున్నాం.

మిషన్‌ భగీరథపథకాన్ని రాష్ట్రముఖ్యమంత్రిప్రారంభించి ఇంటింటికి నల్లాలద్వారా మంచినీరు అందించడం జరుగుతుంది.

దేశానికే మోడల్‌గా తెలంగాణ విద్య

సహజ వనరులతోపాటు మానవవనరుల అభివృద్ధితోనే బంగారుతెలంగాణ నిర్మాణంసాధ్యమవుతుందని నమ్మినసి.ఎం. కేసిఆర్‌ రాష్ట్రంలో 570 గురుకులపాఠశాలలు, 53 డిగ్రీ మహిళా రెసిడెన్షియల్‌ క ళాశాలలను ఏర్పాటుచేశారు. తెలంగాణలో చదివిన విద్యార్థి ప్రపంచంలో ఎవరికీ తీసుపోకుండా ఉండే నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తున్నారు. వచ్చేవిద్యాసంవత్సరం మరో 119 బిసిగురుకులాలను ప్రారంభించాలని సిఎం కేసిఆర్‌ఇప్పటికే నిర్ణయించారు. రాష్ట్రంలోనిఅన్నిప్రభుత్వవిద్యాలయాలు, గురుకులాలు, మోడల్‌ స్కూల్స్‌, కేజీబీవీలలో 7వతరగతినుండి 12వతరగతివరకుచదివే 6 లక్షల బాలికల ఆరోగ్యపరిరక్షణ కోసంహెల్త్మరియుహైజీన్స్కిట్స్‌అందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చాక పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసుకోవడంతో, ఏర్పాటైన కొత్త జిల్లాలు, మండలాల్లో అదనపు కేజీబీవీలు కావాలని కోరితే రాష్ట్రానికి 84 కేజిబివిలు అదనంగా వచ్చాయి. ఈ ఏడాది 88 కేజీబీవీలు జూనియర్‌ కాలేజీలు అయ్యాయి. కంటిపరీక్షలు చేసి అవసరమైన పరికరాలుఅందించడంతో పాటు శస్త్రచికిత్సకూడా చేయడం ద్వారా అంధత్వరహిత తెలంగాణలక్ష్యంతోరాష్ట్రముఖ్యమంత్రి కంటి వెలుగుకార్యక్రమాన్ని నేటినుండి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. వివిధ కార్యక్రమాలను ఆయన వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.

——————