బంజరాల వన సమారాధన

బంజర సంప్రదాయాన్ని కాపాడుకుందం

కారేపల్లి: బంజరాల వన సమారాధాన కార్యక్రమాన్ని ఆదివారం కారేపల్లిలోని శ్రీకవిత ఇంజనీరింగ్‌ కళాశాల మామిడి తోటలో నిర్వహించారు. సమారాధనకు మండలంలోని అధికంగా బంజరా గిరిజనులు హాజరైనారు. సమారాధనలో లంబాడ పాటలు, నృత్యాలతో అలరింపచేశారు. ఈసంధర్బంగా బానోత్‌ బాలునాయక్‌ అధ్యత వహించిన కార్యక్రమంలో ప్రముఖ బంజర ప్రాతికేయులు అజ్మీర వీరన్న మాట్లాడుతూ బంజార సంస్కృతిని, సంప్రదాయాన్ని రేపటి తరానికి పరిచయం చేయాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా జాతి అభ్యున్నతి విషయంలో ఐక్యత చాటాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జనాభా ప్రాతిపధికన రావాల్సిన రిజర్వేషన్లు, నిధులపై పాలకుల పై ఒత్తిడి తీసుకరావటానికి జాతీ మేధవులు నడుంబిగించాలనికోరారు. కారేపల్లి మండలంలో లంబాడా కమ్యూనిటీ భవనం, సేవాలాల్‌ ఆసలయం కోసం అందరు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈసంధర్బంగా మండలంలోమాజీ బంజరా సర్పంచ్‌లను ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో బంజరా గిరిజన సంఘాల నాయకులు మంగీలాల్‌, సుబ్బారావు, రవీందర్‌, లక్ష్మన్‌, రాందన్‌, రాంసింగ్‌, వెంకటయ్య, గాంధీ, రాంకిషోర్‌, శివానాయక్‌,, జర్పలరవి, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.