బడిబాటతో మారుతున్న పరిస్థితులు

వరంగల్‌,జూన్‌19(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జయశంకర్‌ సార్‌ బడిబాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందిస్తూ విద్యార్థి భవిష్యత్తుకు పునాదులు వేసేందుకు బడిబాట కార్యక్రమం ఎంతోగానో దోహదపడుతుంది. బడిబాటలో భాగంగా సర్వే నిర్వహించి ఉపాధ్యాయులు ప్రతీ పిల్లవాడిని పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, కేజీబీవీ పాఠశాలల్లో ఐదు రోజుల బడిబాట కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. పాఠశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ చైర్మన్‌, సభ్యులు, ఏఎన్‌ఎంలు, సిబ్బంది బడిబాట ర్యాలీలు నిర్వహించారు. బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలని నినాదాలు చేశారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోదన ఉంటుందని, ప్రసుత్తం ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు మెరుగుపడ్డాయని ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ విద్యార్థులకు అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం తదితర సౌకర్యాల గురించి వివరించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అనేక మండలాల్లో విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.