బలహీనవర్గాలకు రాజకీయ ధీమా

కొత్తను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం
మెదక్‌,మార్చి27(జ‌నంసాక్షి): మెదక్‌ ఎంపి ఎన్నికల్లోకొత్త ప్రభాకర్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి కెసిఆర్‌కు కానుకగా ఇవ్వాలని జడ్పీ ఛైర్‌ పర్సన్‌ రాజమణి యాదవ్‌ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో భారీ మెజార్టీయే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి ప్రచారం చేస్తామన్నారు. నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌ ఉందన్నారు.  పార్లమెంట్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డిని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుల పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బూత్‌ స్థాయిలో ప్రతి ఇంటికీ తీసుకువెళ్తామన్నారు. అన్నివర్గాలను కెసిఆర్‌ ఆదరించి ఎందరనికో రాజకీయ భిక్ష పెట్టారని అన్నారు. ఇందుకు గత రాజ్యసభ ఎన్నికలే నిదర్శనమని అన్నారు.  రాజ్యసభకు బడుగు, బలహీన వర్గాల వారినే సీఎం కేసీఆర్‌ అభ్యర్థులుగా ఎంపిక చేసి ఆదర్శంగా నిలిచారని  అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పాలన కొనసాగుతుందని అన్నారు.  అందుకు అన్నిరంగాల్లో బడుగు బలహీనవర్గాలకు పెద్దపీట వేయడంతోపాటు రాజ్యసభఅభ్యర్థుల ఎంపిక నిదర్శనమని అన్నారు. ఎన్నికల్లో పోటీ  చేయాలంటేనే  భయపడే  బలహీనవర్గాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాధాన్యం కల్పిస్తుందని కెసిర్‌ నిరూపించారని అన్నారు.  రాజ్యసభకు ఈ తరహా అభ్యర్థులను ఎంపిక చేసి రాజకీయాల్లో పారదర్శకతను నిరూపించుకున్న మహానీయుడు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. పార్టీ ఆవిర్భావం నుంచి సీఎం కేసీఆర్‌తోపాటు టీఆర్‌ఎస్‌ వ్యవహారాల్లో కీలకపాత్ర పోషించిన వ్యక్తులనే రాజ్యసభకు పంపి  విలువలకు పెద్దపీట వేయడమేనన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నికలు వచ్చినా పోటీ చేసే బడుగు, బలహీన వర్గాల అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వడం సీఎం కేసీఆర్‌ సాంప్రదాయమన్నారు.  కేసీఆర్‌ నాయకత్వంలో పని చేసేందుకు, భాగస్వాములయ్యేందుకు బడుగు బలహీన వర్గాలతోపాటు హరిజన, గిరిజన, మైనార్టీ ప్రజలు అంతా ముందుకు రావడం మరింత ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఎంపి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.