బస్సులు, ప్రైవేట్‌ వాహనాలన్నీ బుక్కయ్యాయి

సింగరేణి నుంచి ఎక్కువమంది తరలి వెళ్లేలా ప్లాన్‌

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌31(జ‌నం సాక్షి): మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆదిలాబాద్‌,నిర్మల్‌ రెండు నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి 12నుంచి15 వేల మందిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో 176 ఆర్టీసీ బస్సులు బుక్‌ చేయగా.. ప్రైవేటు పాఠశాలల బస్సులతో పాటు ఇతర ప్రైవేటు వాహనాలను సిద్ధం చేశారు. నిర్మల్‌ నియోజకవర్గంలో 100 ఆర్టీసీ బస్సులు, 100 టవేరాలు, 75 ప్రైవేటు పాఠశాలల వా హనాలు, 200 సొంత వాహనాల్లో తరలి వెళ్లేందుకు ఏర్పా ట్లు చేశారు. ఖానాపూర్‌ నియోజకవర్గంలో 125 బస్సులు, 150 టవేరాలు, 100 కార్లు, 5 ఐచర్‌ వాహనాల్లో జనసవిూకరణకు ఏర్పాట్లు చేశారు. ముథోల్‌ నియోజకవర్గంలో 60 బస్సులు, 500 ఇతర వాహనాల్లో తరలి వెళ్లనున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో 150 ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, 120 ఇతర వాహనాల్లో 10 వేల మంది వరకు తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గం నుంచి 8-10 వేల మంది తరలి వెళ్లేందుకు 50 ఆర్టీసీ, 80 ప్రైవేటు బస్సులు, 70 ఇతర వాహనాల్లో జనాన్ని

తీసుకెళ్లనున్నారు. మంచిర్యాల జిల్లాలో సింగరేణి ప్రాంతం కావడంతో ఎక్కువ మంది కార్మికులను తీసుకెళ్లేందుకు దృష్టి సారించారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో 60 ఆర్టీసీ బస్సులను బుక్‌ చేశారు. బోథ్‌ నియోజకవర్గం నుంచి 16 ఆర్టీసీ, ప్రైవేటు బస్సు లు, 35 ప్రైవేటు పాఠశాలల బస్సులు, 550 ప్రైవేటు వాహనాల్లో సుమారు 9 వేల మందిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నా రు. ఆసిఫాబాద్‌, సిర్పూర్‌(టి) నియోజకవర్గాల నుంచి ఒక్కో సెగ్మెంటుకు సగటున 10వేలకు తగ్గకుండా సవిూకరిస్తున్నారు. బోథ్‌, ముథోల్‌, ఆదిలాబాద్‌ నియోజకవర్గాల వారి కోసం పక్కనే ఉన్న మహారాష్ట్రలోని ప్రైవేటు వాహనాలకు అద్దెకు తీసుకొని జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సిర్పూర్‌(టి), మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాలకు రైలు సౌకర్యం ఉండడంతో.. సాధ్యమైనంత ఎక్కువ మందిని రైళ్ల లో తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

—————