బాధ్యతలు స్వీకరించిన ఈదశంకర్‌ రెడ్డి

44778899

-అభినందించిన మంత్రుల కేటీఆర్‌, హరీశ్‌

హైదరాబాద్‌,అక్టోబర్‌ 26(జనంసాక్షి): ఉద్యమంలో కేసీఆర్‌ వెంట ఉన్న వారికి అందరికి గుర్తింపు లభిస్తుందని మంత్రి కేటీఆర్‌  అన్నారు. ఏదో ఒక పోస్టు ఇచ్చి గౌరవిస్తామన్నారు. త్వరలో మరి కొందరు నాయకులకు పదవులు ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు.  రాష్ట్ర ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఈద శంకర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. శంకర్‌రెడ్డిని ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా కెటిఆర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని సిఎం కెసిఆర్‌ ఆదరిస్తారని అన్నారు. తెలంగౄణ ఉద్యమంతో పాటు, దాని అభివృద్దిలోనూ ప్రతి ఒక్కరూ బాధ్యులు కావాలన్నారు. మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. నీటిపై అనుభవం ఉన్న ఈద శంకర్‌రెడ్డిని ఇరిగేషన్‌ ఛైర్మన్‌గా నియమిండం సంతోషకరమైన విషయమన్నారు. శంకర్‌రెడ్డిని నియమించిన సీఎం కేసీఆర్‌కు ధన్యావాదాలు తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో లిఫ్టులన్ని మూలన పడ్డాయని తెలిపారు. వాటిని రిపేరు చేయించి తెలంగాణలోని ప్రతీ ఎకరాకు సాగునీటిని అందించేలా కృషి చేస్తున్నామన్నారు. లిఫ్టులన్నింటిని రిస్టోర్‌ చేయడానికి తగినన్ని నిధులు కేటాయిస్తామన్నారు.  దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఇవాళ తెలంగాణలో నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ మిషన్‌ కాకతీయతో చెరువుల పునర్నిర్మాణం చేశారని వివరించారు. చెరువుల మట్టితో భూములు సారవంతమైనాయని పేర్కొన్నారు. కల్వకుర్తి లిఫ్టుతో పాలమూరు సస్యశ్యామలమవుతోందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఏ పాలమూరు బిడ్డ వలస పోడని చెప్పారు. ఎంపి వినోద్‌ మాట్లాడుతూ.. గోదావరి జలాలను పూర్తిగా వినియోగించుకుంటున్నామని తెలిపారు. సాగునీటి విషయంలో ఖర్చుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.కార్యక్రమానికి మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌, కేటీఆర్‌, నాయిని నర్సింహరెడ్డి, ఎంపీ బాల్క సుమన్‌, ఎమ్మెల్యే బొడిగే

శోభ, దేశపతి శ్రీనివాస్‌ తదితరులు హాజరయ్యారు.