బాబ్రీ కూల్చివేత కేసు మళ్లీ తెరపైకి

4

అద్వానీ సహా భాజపా అగ్రనేతలకు తాఖీదులు

న్యూఢిల్లీ,మార్చి31(జనంసాక్షి):  బాబ్రీ మసీదు కూల్చివేత కేసు మరోమలుపు తిరిగింది. ఇందులో దోషులగా ఉన్న బిజెపి నేతలను తప్పించాలన్న అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్పందించింది.  బాబ్రీ కూల్చివేత కేసులో  బీజేపీ సీనియర్‌ నేత లాల్‌ కృష్ణ అద్వానీ , మురళీమనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, ఇతర 20 మందికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బాబ్రీ మసీదు కూల్చి వేత కేసు నుంచి అడ్వాణీ, ఇతరుల పేర్లు తొలగిస్తూ అలహాబాద్‌ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నాలుగు వారాల్లో నోటీసులకు వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తులో జాప్యంపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలంటూ సీబీఐకి కూడా సుప్రీం నోటీసులు జారీ చేసింది. తదుపతి విచారణను కోర్టు నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.  అభియోగాలు తొలగింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించిన కోర్టు ఈమేరకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.  1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసు నుంచి విముక్తిపై న్యాయస్థానం ఈ మేరకు నోటీసులు ఇచ్చింది.  అద్వానీతో పాటుమురళీ మనోహర్‌ జోషి, కల్యాణ్‌ సింగ్‌, ఉమాభారతితో పాటు  వీహెచ్పీ నేతలకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.  అలాగే బాబ్రీ మసీదు కూల్చివేత వ్యవహారంలో న్యాయస్థానం వివరణ కోరింది.  తదుపరి విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. కాగా బాబ్రీ కేసు నుంచి అలహాబాద్‌ కోర్టు అద్వానీకి విముక్తి కల్పించిన విషయం తెలిసిందే. బాబ్రీ మసీదు కూల్చివేత కుట్ర కేసు నుంచి అద్వానీ సహా 19 మందికి ఉపసమనం కల్పిస్తూ అలహాబాద్‌ హైకోర్టు వెలువరించిన తీర్పును సిబిఐ సుప్రీం కోర్టులో సవాల్‌ చేసింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు కుట్ర పన్నారన్న కేసు నుంచి  అలహాబాద్‌ హైకోర్టు ఉపశమనం కల్పించింది. అలహాబాద్‌ కోర్టు విముక్తి కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ మహబూబ్‌ అహ్మద్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు వారికి నోటీసులు ఇచ్చింది. మరోవైపు అల్హాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని సీబీఐని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.