బాలకార్మికులను పెట్టుకుంటే చర్యలు

కామారెడ్డి,పిబ్రవరి2(జ‌నంసాక్షి): బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని కార్‌ఇమక శాఖ అధికారులు హెచ్చరించారు. చట్టానికి వ్యతిరేకంగా ఆయా కేంద్రాల యజమానులు బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవన్నారు. జైలుశిక్షతో పాటు రూ.50వేల జరిమానా ఉందన్నారు.జిల్లాలో బాలకార్మికులను గుర్తించే కార్యక్రమం చేపట్టారు. బాలకార్మిక చట్టం ప్రకారం 14 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవద్దన్నారు. విద్యాహక్కును కల్పించిన బాధ్యత మనపై ఉందన్నారు.8 ఏళ్లు నిండే వరకు చదువు చెప్పించాలన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లల బాగోగులకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.