బాలికల విద్యకు భరోసా

కస్తూర్బాల్లో ఇంటర్‌ వరకు స్థాయి పెంపు
గ్రావిూణ ప్రాంత విద్యార్థినులకు వరం
నెరవేరుతున్న సీఎం కెసిఆర్‌ హావిూ
గజ్వేల్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): వంద శాతం ఫలితాలు సాధిస్తూ బాలికల విద్యకు భరోసా కల్పిస్తున్న కస్తూర్బా విద్యాలయాల స్థాయి పెంపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పదవ తరగతి వరకు ఉన్న కస్తూర్బా విద్యాలయాల స్థాయిని ఇంటర్‌ వరకు పెంచడంతో చాలా మంది గ్రావిూణ ప్రాంత విద్యార్థినులకు ప్రయోజనం చేకూరనుంది. అందరికి అందుబాటులోకి విద్యను తీసుకరావాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యారంగానికి అధిక ప్రాధాన్యతను కల్పిస్తూ గ్రావిూణ ప్రాంత విద్యార్థునుల్లో ఎంతో ఆసక్తిని పెంపొందిస్తున్నారు. గ్రావిూణ ప్రాంత బాలికల విద్యాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన కస్తూర్బా విద్యాలయాల్లో ఇంటర్మీడియట్‌ వరకు పెంచడంతో బాలికల విద్యకు మరో ముందడుగు పడింది. ఈ విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా విశాలమైనా ఖాళీ ప్రదేశాలల్లో కొత్త భవనాలును నిర్మించి అన్ని మౌలిక వసతులు కల్పించింది. ఎక్కువగా గ్రావిూణ ప్రాంత విద్యార్థినులే ఈ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. పదవ తరగతి చదువు పూర్తవగానే చాలా మంది పేద విద్యార్థినులు చదువుమానేసి ఇంటి వద్ద తల్లిదండ్రులకు సాయంగా పనుల్లో నిమగ్నం అవుతున్నారు. దీంతో 2015 మార్చిలో గజ్వేల్‌ వేదికగా అనాథ కస్తూర్బా విద్యార్థినులకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హావిూ నెరవేరింది. జిల్లాలో 22 మండలాలుండగా కొత్తగా ఏర్పాటైన మండలాల్లో మినహా పాత మండలాల్లో 16కస్తూర్బా విద్యాలయాలున్నాయి. పదివరకే చదువుకుని మధ్యలో మానేసే బాలికలకు ఇంటర్‌ విద్యతో ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం ఫలితాలు సాధించే లక్ష్యంగా విద్యార్థులను తీర్చిదిద్దుతుంది. అందుకు గత నవంబర్‌ మాసం నుంచి అన్ని ప్రభుత్వ, కస్తూర్బాపాఠశాలల్లో ప్రత్యేక తరగతులు ప్రారంభించింది. ముఖ్యంగా మండల కేంద్రాల్లో బాలికల విద్యాభివృద్ధికోసం ప్రవేశపేట్టిన కస్తూర్బా విద్యాలయాలను  ఇంటర్‌ వరకు స్థాయికి పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంటర్మీడియట్‌ వరకు స్థాయి పెంచితే గ్రావిూణ ప్రాంత విద్యార్థులతో పాటు అనాథ విద్యార్థులకు ఎంతో కలిసోస్తుంది. జిల్లాలో 22 మండలాలుండగా కొత్తగా ఏర్పాటైనా మండలాల్లో మినహా పాత మండలాల్లో 16 కస్తూర్బా బాలికల విద్యాలయాలున్నాయి. పదవ తరగతి వరకే చదువుకొని మధ్యలో చదువు మానేసే బాలికలకు ఇంటర్‌ విద్యతో ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. గ్రావిూణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం మండల కేంద్రాల్లో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను నెలకొల్పి వీటిలో 5వ తరగతి నుండి 8వ తరగతి వరకు తరగతులను ప్రారంభించి బ్జడెట్‌ను భరించింది. ఎనిమిదవ తరగతి పూర్తయిన బాలికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం 9వ,10వ తరగతులు ప్రారంభించి వాటి ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.