బాలుర వసతిగృహంలో అడ్మిషన్లు ప్రారంభం

 మండల కేంద్రమైన చండ్రుగొండ లోని   బాలుర వసతిగృహంలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని హాస్టల్  వార్డెన్ లక్ష్మణరావు తెలిపారు.ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్థానిక హాస్టల్ లో  60సీట్లు ,పాత కొత్తగూడెంలో  70సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు.ప్రతి విద్యార్థికి  4జతల దుస్తులు,  పుస్తకాలు  చెప్పులు ప్రభుత్వం అందిస్తుందని, ఒక్కొక్కరికి  సబ్బుల నిమిత్తం నెలకు  62రూపాయలు  ఇవ్వడం జరుగుతుందన్నారు.ప్రతి  15రోజుల కొకసారి  వైద్యుల పర్యవేక్షణ తో పాటు   ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కటి భోజన వసతి సౌకర్యం  ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.అడ్మిషన్ కోసం   వచ్చేవారు పాస్ ఫోటోలు  2,ఆధార్ కార్డు జిరాక్స్,కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలను  సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.