బాసరలో వసంతపంచమి వేడుకలు

భారీగా అక్షరాభ్యాసాలు
నిర్మల్‌,జనవరి22(జ‌నంసాక్షి): వసంతపంచమి పుణ్యతిథిని పుస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అబిషేకాలు నిర్వహించారు. సోమవారం వేకువజామున వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి దర్శనం, చిన్నారులకు అక్షర శ్రీకారాల కోసం వేకువజామున 2గంటల నుంచే భక్తులు బారులు తీరారు. దీంతో అక్షరాభ్యాస మండపాలు, క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దర్శనానికి 2గంటలు, అక్షర స్వీకారానికి 4గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం తరపున ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ నగేష్‌, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. విఐపిలుతో పాటు భారీగా భక్తులు రావడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు ఉదయాన్నే గోదావరిలో స్నానం చేసి అమ్మవారి దర్శనం కోసం క్యూకట్టారు. మహారాష్ట్రత దితర ప్రాంతాల నుంచి కూడా అక్షరాభ్యాసం కోసం చిన్నారులతో తరలి వచ్చారు.
యాచారంలో ప్రత్యేక పూజలు
ఇదిలావుంటే రంగారెడ్డి జిల్లా మండలం యాచారం నందివనపర్తి నందీశ్వరాలయ సవిూపంలో ఆదివారం 108 జ్ఞాన సరస్వతీ విగ్రహాలకు 3 వేల మంది మహిళలు కుంకుమార్చన చేశారు. వేదపండితులు 108 ¬మగుండాలలో ¬మం నిర్వహించారు. జ్ఞాన సరస్వతి సేవాసమితి ఆధ్వర్యంలో ఈ పూజ కార్యక్రమాలను చేపట్టారు.