బాసర అకౌంటెంట్ అవినీతి లీలలు…

basara _0 copy

ఆదిలాబాద్ : కొందరు ఆలయాధికారులు అక్రమసంపాదనతో బాసర సరస్వతి ఆలయం అబాసుపాలవుతోంది. జ్ఞాన సరస్వతి దేవిగా పూజలందుకునే అమ్మవారి వద్దకు భక్తితో వచ్చే భక్తులను నిలువుదోపిడి చేస్తుండడం ఒకవైపు … అక్కడే పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బందిని సైతం వదలకుండా వారి జీతభత్యాల్లో కమీషన్లు నోక్కేస్తూ మరోవైపు అధికారులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తాజాగా హోంగార్డుల జీతాల్లో సైతం వాటాలు పంచుకున్న ఓ అవినితి అధికారి గుట్టురట్టయింది.

దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన సరస్వతిదేవి ఆలయం..
బాసర సరస్వతి క్షేత్రం తెలుగు రాష్ట్రాల్లో నే కాకుండా మహారష్ట్ర ,కర్ణాటక లాంటి పోరుగు రాష్ట్రాలనుండి సైతం అమ్మవారి భక్తులు తరలివస్తుంటారు..దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన సరస్వతిదేవి ఆలయాల్లో ఇదోకటి.. ఇదంతా బాగానే ఉన్నా.. ఇప్పుడు అక్కడ ఎందెందు వెతికినా అవినితి అందందే కలదు అన్నట్లుగా తయారైంది. బాసర అమ్మవారి ఆలయంలో అవినీతి అధికారులు ఎన్నో సంవత్సరాలనుండి తిష్టవేయడంతో సంపాదనమార్గాలపై మంచిపట్టు ఏర్పర్చుకున్నారు. కొందరు అధికారులు కింది స్థాయి ఉద్యోగులు నుండి కమిషన్లు నొక్కేస్తున్నారు.

కక్కుర్తికి కేరాఫ్ గా అధికారులు…
ఏ ప్రభుత్వ అధికారి అయిన తాను పనిచేస్తున్న స్థానంలో మూడు సంవత్సరాలకు మించి పనిచేయకూడదు కిందిస్థాయి అధికారులు అయితే కనీసం ఆరు సంవత్సరాలకు మించకూడదు. డిప్యుటేషన్ లేదా ఇతర కారణాలతో పైరవీలతో 2,3 సంవత్సరాలు పెంచుకోని అక్కడే ఉంటున్నారు. బాసరలోని ఆలయంలో ఉద్యోగం చేస్తున్న శంకర్ ఏకంగా 16 సంవత్సరాల నుండి అక్కడే అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. ఈయనగారు అసలు ఉద్యోగం చేయాల్సిన ప్రాంతం హైదరాబాద్ లోని నల్లకుంట రామాలయం… కాని బాసరలో తిష్టవేసి 16 సంవత్సరాలైంది. ఇదంతా ఒక ఎత్తైతే ఆయన గారి పై ఆరోపణలు భారీగానే ఉన్నాయి. అకౌంటెంట్ కావడంతో అడ్వాన్స్ ల రూపంగా డబ్బులిచ్చేది ఈ సారే కాబట్టి భారీగా కమీషన్లు నోక్కేస్తాడని ప్రచారం ఉంది.

సెక్యురిటికి 30 మంది హోమ్ గార్డులు…
బాసరలో ఆలయ సెక్యురిటి చూసుకోవడానికి 30 మంది హోమ్ గార్డులను జిల్లా పోలిస్ డిపార్ట్ మెంట్ ఆలయానికి అప్పగించింది… వీరికి జీతాలను ఆలయఆదాయం నుండే చెల్లిస్తారు… వీరికిరోజు 8 గంటల డ్యూటీకి గాను నెలకు 12,000 రూపాయల జీతం ఇస్తున్నారు…ఈ ముప్పైమందిలో ఓ హోమ్ గార్డ్ మరణించగా ప్రస్థుతం 29 మంది పనిచేస్తున్నారు… తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వీరి భృతిని పెంచింది ….జీవో విడుదలైనప్పటి నుండి పెంచిన జీతాన్ని ఆలయం అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది… నెల నెల జీతం ఇచ్చారు కాని పెరిగిన జీతం ఇవ్వలేదు… ఏరియర్స్ మూడులక్షలు హోమ్ గార్డులకిచ్చేందుకు కమిషన్ కోసం డిమాండ్ చేశారని హోమ్ గార్డ్ లు అంటున్నారు .. అకౌంటెంట్ శంకర్ కు మూడు లక్షలకుగాను యాభై వేలు ముట్టచెప్పనిదే ఇవ్వనని మొండికేయడంతో తమకు న్యాయంగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రావాల్సిన డబ్బును సైతం యాభైవేల రూపాయలు ముందుగానే శంకర్ కు ఇచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని టెన్ టీవికి తెలిపారు.

రోజూవారీ కూలీల బిల్లుల్లో కూడా కమీషన్ …
హోంగార్డుల విషయంలోనే కాకుండా ఈ అధికారి ఆలయంలో పనిచేయడానికి వచ్చే స్వీపర్లు ఇతర రోజూవారీ కూలీల బిల్లుల విషయంలో సైతం కమీషన్ లు తీసుంటాడనే ఆరోపణలున్నాయి. ఇదే విషయాన్ని 10 టివి అకౌంటెంట్ శంకర్ ను ప్రశ్నించింది. కాని బుకాయించే ప్రయత్నం చేశాడు శంకర్ .

అక్షరాభాస్యం నుండి అన్నదానం వరకు అక్రమాల …
ఇలా అధికారులు అక్రమార్జనకు అలవాటు పడడంతో అక్షరాభాస్యం మొదలుకొని అన్నదానం వరకు అడుగడుగునా అక్రమాల జాతర నడుస్తున్నది. ఈ క్రమంలోనే భక్తులు అందజేసే విరాళాలు, విలువైన కానుకలు మాయమవుతున్నట్లు ఆరోపణలున్నాయి.. ఇప్పటికైనా ఉన్నతాదికారులు చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత అద్వాన్నంగా తయారయ్యే అవకాశం ఉంది.