బిఎ విద్యార్థుల ప్రశ్నాపత్రంలో టిడిపి క్వశ్చన్‌

ఇదేమి తీరని నిరసించిన విద్యార్థులు
అనంతపురం,మార్చి26(జ‌నంసాక్షి):  అనంతపురం ఆర్ట్స్‌ కాలేజీలో బీఏ చదువుతున్న విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా, పొలిటికల్‌ సైన్స్‌ లో తెలుగుదేశం పార్టీ గురించి రాయాలన్న ప్రశ్న ఇవ్వడంతో పరీక్షకు హాజరైన వారు ఖంగుతిన్నారు. అటానమస్‌ ¬దా ఉన్న ఈ కాలేజీ సొంతంగా ప్రశ్నాపత్రాలు తయారు చేసుకుంటుంది. బీఏ సెకండ్‌ ఇయర్‌, నాలుగో సెమిస్టర్‌ ప్రశ్నాపత్రంలో ఎనిమిది అంశాలను ఇస్తూ, అందులో ఏవైనా ఐదు ప్రశ్నలకు సమాధానం రాయాలని చెబుతూ, ఒక్కో ప్రశ్నకు 4 మార్కులను ఇచ్చింది వర్శిటీ. బాధ్యతాయుత ప్రభుత్వం, భారత ఉప రాష్ట్రపతి, మంత్రిమండలి, సంకీర్ణ ప్రభుత్వం, ద్విశాసన సభ, ఎన్నికల సంస్కరణలు, తెలుగుదేశం పార్టీ, పార్టీ ఫిరాయింపుల చట్టం… అంశాలను ఇస్తూ, అందులో ఐదు ఎంచుకోవాలని కోరింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా, ఇలా ఓ పార్టీ గురించి రాయాలనడం కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందని అంటూ, పలువురు విద్యార్థులు క్వశ్చన్‌ పేపర్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. కాగా, ఈ ప్రశ్నాపత్రాన్ని తాము తయారు చేయలేదని, మరో వర్శిటీ నుంచి వచ్చిందని కాలేజ్‌ ఉన్నతాధికారులు వ్యాఖ్యానించడం గమనార్హం.