బీజేపీలో పోటీ చేసే నాయకులపై స్పష్టత కరవు

ఆదిలాబాద,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): తెలంగాణలో 18 లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించిన బిజెపి పార్లమెంట్‌ ఎన్‌ఇనకలకు సంబంధించి ఎలాంటి హడావిడి చేయడం లేదు. కనీసంగా వచ్చే ఎన్‌ఇనకల కోసంమందే తమ అభ్యర్థలను ప్రకటించే సామసం కూడా చేయడం లేదు. బీజేపీ నుంచి ఆదిలాబాద్‌, పెద్దపల్లి సీట్ల కోసం నాయకులు పోటీ పడుతున్నా, పార్టీ అధిష్టానం నుంచి తగిన స్పందన లేనట్లు
తెలుస్తోంది.పెద్దపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య టికెట్టు ఆశిస్తున్నారు. ఆయనతో పాటు బెల్లంపల్లి, చెన్నూరు నుంచి పోటీ చేసిన కొయ్యల ఏమాజీ, అందుగుల శ్రీనివాస్‌ తదితరులు కూడా టికెట్టు ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధమేనని చెపుతున్నట్లు సమాచారం.  ఆదిలాబాద్‌, ముథోల్‌, నిర్మల్‌, ఖానాపూర్‌లలో గత శాసనసభ ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించడంతో ఇక్కడ టికెట్టు కోసం పోటీ తీవ్రంగానే ఉంది. ఖానాపూర్‌ నుంచి పోటీ చేసి 20వేల పైచిలుకు ఓట్లు సాధించిన సట్ల అశోక్‌ టికెట్టు రేసులో ముందున్నారు. ఇక బోథ్‌లో పోటీ చేసిన మడావి రాజు, మాజీ మంత్రి అమర్‌సింగ్‌ తిలావత్‌, ఆడె మానాజీ, శ్రీరాం నాయక్‌లు సైతం టికెట్టు ఆశిస్తున్నారు. అయితే ఎవరిని నిలబెడతారన్న సంకేతాలు కూడా ఇవ్వడం లేదు.