బీజేపీ మళ్లీ గెలిస్తే.. 

ఇండియా హిందూ పాకిస్థాన్‌ అవుతుంది!
– కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌
– రాహుల్‌ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్‌
న్యూఢిల్లీ, జులై12(జ‌నం సాక్షి) : 2019లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ఇండియా ఓ హిందూ పాకిస్థాన్‌ అవుతుందని కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ అన్నారు. దేశంలో మైనార్టీల హక్కులను అణిచేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో శశి థరూర్‌ మాట్లాడుతూ.. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలిస్తే కొత్త రాజ్యాంగాన్ని రాస్తుందని, అది దేశాన్ని మరింత అసహనం దిశగా తీసుకెళ్తుందని థరూర్‌ అన్నారు. మన ప్రజాస్వామ్య రాజ్యాంగం ఇక మనుగడ సాగించలేదు. ఆ రాజ్యాంగాన్ని మొత్తం మార్చేసి కొత్తదాన్ని రాసే అన్ని శక్తులు బీజేపీలో ఉన్నాయి అని థరూర్‌ చెప్పారు. కొత్త రాజ్యాంగంలో హిందూ రాష్ట్ర ఆదర్శాలు మాత్రమే ఉంటాయన్నారు. మైనార్టీలకు సమానత్వం అనేది ఉండదని, గాంధీ, పటేల్‌, నెహ్రూ, మౌలానా ఆజాద్‌ తీవ్రంగా వ్యతిరేకించిన హిందూ పాకిస్థాన్‌గా ఇండియా మారుతుంది అని థరూర్‌ స్పష్టంచేశారు.
అయితే ఆయన వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ వల్లే పాకిస్థాన్‌ ఏర్పడిందని, ఇప్పుడు మరోసారి దేశాన్ని, దేశంలోని హిందువులను అవమానించేలా థరూర్‌ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన విమర్శించారు. రాహుల్‌ గాంధీ కచ్చితంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశా