బీసీల్లోనే కడు పేదవారున్నారు

వారి సంక్షేమానికి చిత్తశుద్దితో కృషి

ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు ద్వారా అభివృద్ది

3న బిసి ఎంపి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో భేటీ

అసెంబ్లీలో సిఎం కెసిఆర్‌ ప్రకటన

హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): అన్ని కులాలో కూడా కడుపేదలు ఉన్నారని, వాళ్ల సంక్షేమమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని సిఎం కెసిఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల కన్నా బీసీలలో కడు పేదరికంలో ఉన్న వారున్నారని గుర్తు చేశారు.దాని కోసమే ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. బీసీలలో, అనేక కులాలలో దళితులు, గిరిజనుల కంటే కడుపేదవాళ్లు చాలా మంది ఉన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తారల సందర్భంగా వెనుకబడిన తరగుల సంక్షేమంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్య సదస్సు ఉన్న కారణంగా డిసెంబర్‌ 3వ తేదీన సర్వ సమగ్ర వివరాలతోని వెనుకబడిన తరగతుల సంక్షేమం గురించి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశాని బీసీ వర్గానికి సంబంధించిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలను ఆహ్వానిస్తామన్నారు. ఈ సమావేశంలో ఇప్పటివరకూ బీసీలకు కేటాయించిన బ్జడెట్‌ ఎంత, జరిగిన ఖర్చు ఎంత, ఎంబీసీ కార్పొరేషన్‌ కేటాయించిన బ్జడెట్‌ ఎంత, ప్రభుత్వం చేయాలనుకున్న కార్యక్రమాలు ఏంటి తదితర అంశాలపై సభ్యులు సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. అత్యంత వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. మన రాష్ట్రంలో ఉండే అత్యధిక జనాభా బీసీలే అని తెలిపారు. 50 శాతానికి పైబడి ఉన్న బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం ఉద్ఘాటించారు. ప్రభుత్వానికి బీసీల సంక్షేమానికి మించిన ప్రాధాన్యత వేరొకటి ఉండదని స్పష్టం చేశారు. బీసీ కార్పొరేషన్‌ త్వరలోనే ఇవ్వబోయే సర్వసమగ్ర వివరాలతో డిసెంబర్‌ 3వ తేదీన బీసీ శాసనసభ్యులు, మండలి సభ్యులు, పార్లమెంట్‌ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. ఆరోజున బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు ఏమటి? ఎటువంటి కార్యక్రమాలు అమలు చేయాలి? ఇప్పటి వరకు వారి సంక్షేమం కోసం ఖర్చు చేసింది ఎంత? అనే అంశాలపై సమగ్రంగా మాట్లాడుకుందామని సూచించారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో బంగారు తెలంగాణకు బాటలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో అవసరం లేదన్నారు. ఎంబీసీల సంక్షేమం కోసం అమూల్యమైన సూచనలు ఇవ్వండి అని సభ్యులకు సీఎం కేసీఆర్‌ సూచించారు. ప్రశ్నోత్తరాలలో భాగంగా సభ్యులు అత్యంత వెనుకబడిన తరగతులపై అడిగిన ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్‌ , సున్నం రాజయ్య తదితరులు ప్రశ్నలకు మంత్రి జోగురామన్న సమాధానం ఇచ్చారు. దీనికి ఆయన సమాధానంగా.. ఈ సందర్భంగా ఎంబీసీలకు బ్జడెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించామని తెలిపారు. ఎంబీసీల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని అన్నారు. ఎంబీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్‌ వేసిన తర్వాత నిర్ధిష్ట సిఫార్సుతోటి వివరాలు, నివేదికలు సమర్పించాలని అదేశాలు జారీ చేశామని తెలిపారు. అయితే ఈ ఆరు నెలల కాలంలో బీసీ కమిషన్‌ వివిధ శాఖ అధికారులతో ప్రాథమిక సమావేశం నిర్వహించామన్నారు. సమావేశం అనంతరం వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేక బ్జడెట్‌ రూపొందించామన్నారు. కాగా బీసీ కవిూషన్‌ సభ్యులు సెప్టెంబర్‌లో కర్ణాటక బీసీ కమిషన్‌ సందర్శించారన్నారు. కాగా ఇప్పటికే రూ.1000 కోట్ల బ్జడెట్‌లో ఇప్పటికే రూ.231 కోట్లు విడుదల చేశామని తెలిపారు. బీసీ కమిషన్‌ అతి త్వరలో నివేదిక సమర్పిస్తే.. దానికి అనుగుణంగా ఈ బ్జడెట్‌ని వినియోగిస్తామన్నారు.