భక్తులతో కిటకిటలాడిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం

రుద్రంగి ఆగస్టు 17 (జనం సాక్షి)
శ్రావణమాసం పూజలకు ప్రత్యేకత రుద్రంగి లో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి బియ్యం ఇవ్వడం మరో ప్రత్యేకత  శ్రావణమాసంలో వచ్చే మొదటి బుధవారం సందర్భంగా రుద్రంగి మండలంలోని శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయనికి భక్తులు పోటెత్తారు.ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ…
ప్రతి సంవత్సరం వచ్చే శ్రావణమాసం లో రుద్రంగి ఇలవేల్పు అయినటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ అని తెలిపారు.
ప్రహ్లాద పర్వతం పై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ
స్వామి వారికి శ్రావణమాసం లో బియ్యం ఇచ్చే ఆనవాయితీ పూర్వీకుల నుండే ఉందని అన్నారు.
ఇంటిల్లిపాదితో ఆలయానికి వచ్చి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటామని తెలిపారు.బియ్యం సమర్పించాడానికి వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ చైర్మన్ కొమిరె శంకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ
సభ్యులు,పరంకుశం అచ్చుత్,ఇప్ప మల్లేశం,
రాచకొండ భాస్కర్,తలారి నర్సయ్య,పాల నర్సయ్య, పడాల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.