భద్రాద్రి ఈవోగా బాధ్యతలు చేపట్టిన పమేల సత్పతి

భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): భద్రాచలం రామాలయం ఈవోగా పమేల సత్పతి బుధవారం బాధ్యతలను తీసుకున్నారు. ఆమె ఐఏఎస్‌ అధికారి ¬దాలో ఇప్పటికే భద్రాచలం ఐటీడీఏ పీవోగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రామాలయం ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. కొంతకాలంగా ఇక్కడ రెగ్యులర్‌ ఈవో లేకపోవడంతో ఆమెను నియమించారు. విజిలెన్స్‌ అధికారి కృష్ణవేణి పూర్తి అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలంలోనే ఉంటున్న ఐఏఎస్‌ అధికారికి ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు ఇవ్వడం విశేషం. భద్రాచలం శ్రీ సీతారామంద్రస్వామి దేవస్థానం ఈవోగా ఐఏఎస్‌ అధికారి పమేలా సత్పథిని నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్‌ జోషి ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం భద్రాచలం ఐటీడీఏ పీవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న సత్పథి దేవస్థానం ఈవోగా పూర్తిస్థాయిలో అదనపు బాధ్యతలను నిర్వహించనున్నారు. దీంతో ఇప్పటి వరకు భద్రాచలం దేవస్థానం ఈవోగా ఉన్న దేవాదాయ శాఖ విజిలెన్స్‌ ఆర్జేసీ కృష్ణవేణి నుంచి పమేలా సత్పథి బాధ్యతలు స్వీకరించారు.భద్రాచలం దేవస్థానం ఈవోగా జూన్‌ 20 వరకు బాధ్యతలు నిర్వహించిన స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యుటీ కలెక్టర్‌ కె. ప్రభాకర శ్రీనివాస్‌ను ఆయన మాతృ శాఖకు పంపిస్తూ 20వ తేదీన ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. నాటి నుంచి మంగళవారం వరకు 48 రోజుల్లో ముగ్గురు ఈవో లనునియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. జూన్‌ 26వ తేదీన దేవాదాయ శాఖ విజిలెన్సు ఆర్జేసీగా బాధ్యతలు స్వీకరిస్తున్న కృష్ణవేణిని భద్రాచలం దేవస్థానం ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై నాలుగున ఆమె దేవస్థానం ఇవోగా బాధ్యతలు స్వీకరించారు. 13న డిప్యుటీ కమిషనర్‌గా, హైదరాబాద్‌లోని గణెళిష్‌ ఆలయం ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న టి. రమేష్‌బాబును ఈవోగా నియమిస్తూ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేసారు. తాజాగా మంగళవారం ఐటీడీఏ పీవో పమేలా సత్పథిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.