భాజపా విద్వేశాలు రెచ్చగొడుతోంది

` జాతిని రెండుగా చీలుస్తోంది: రాహుల్‌ గాంధీ
` తెలంగాణలో ప్రవేశించిన రాహుల్‌ ‘భారత్‌ జోడో యాత్ర’
` అడుగడుగునా కాంగ్రెస్‌ శ్రేణుల ఘనస్వాగతం
నారాయణపేట(జనంసాక్షి): కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ తెలంగాణలోకి ప్రవేశించింది. కర్ణాటకలోని రాయచూర్‌ నుంచి రాష్ట్రంలోని నారాయ ణపేట జిల్లా గూడబల్లూరు సవిూపంలోని కృష్ణ చెక్‌పోస్టు వద్ద రాహుల్‌ తెలంగాణలోకి అడుగుపెట్టారు.కాంగ్రెస్‌ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. ఈ సంద ర్భంగా పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చేరుకోవడంతో మారుతినగర్‌ వద్ద కృష్ణా వంతెన, పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం కనిపించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు ముఖ్యనేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ తదితరులు రాహుల్‌ వెంట నడిచారు.తెలంగాణలో ‘భారత్‌ జోడో యాత్ర’ సుమారు మూడు కిలోవిూటర్ల మేర సాగింది. దీపావళి నేపథ్యంలో ఈనెల 24, 25, 26 తేదీల్లో పాదయాత్రకు రాహుల్‌ విరామం ఇవ్వనున్నారు. 26న ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరిగి ఈనెల 27వ తేదీ నుంచి నవంబరు 7 వరకు రాష్ట్రంలో యాత్ర కొనసాగనుంది. మొత్తం 12 రోజులు, 375 కిలోవిూటర్ల మేర యాత్ర సాగనుంది. నవంబరు 7న కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలోని మద్నూర్‌ మండలంలోని శాఖాపూర్‌ వద్ద రాష్ట్రంలో పాదయాత్ర ముగుస్తుంది.కాగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీసారథ్యంలో కొనసాగుతోన్న భారత్‌ జోడో యాత్రలో తానూ భాగస్వామినవుతానని కేంద్రమాజీ మంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ప్రకటించారు.సమాజంలో సామరస్యతను పెంపొందించేందుకు చేపట్టిన ఈ యాత్ర ప్రస్తుతం తెలంగాణలోకి ప్రవేశించి కొనసాగుతుండగా.. మహారాష్ట్రలోకి ప్రవేశించాక తాను పాల్గొననున్నట్టు చెప్పారు. ఆదివారం ఆయన మహారాష్ట్రలోని బారామతిలో విూడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ నేతలు అశోక్‌ చవాన్‌, బాలాసాహెబ్‌ థోరాట్‌ తనను కలిసి నవంబర్‌ 7న మహారాష్ట్రలోకి భారత్‌ జోడో యాత్ర ప్రవేశించగానే పాల్గొనాలని కోరారన్నారు. సమాజంలో సామరస్యత తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ఈ యాత్రలో ఎక్కడ వీలైతే అక్కడ వివిధ పార్టీలకు చెందినవారు పాల్గొంటారన్నారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి సెప్టెంబర్‌ 7న మొదలైన ఈ యాత్ర జమ్మూకశ్మీర్‌ వరకు కొనసాగనుంది. 150 రోజుల్లో 3,570 కి.విూల మేర కొనసాగనుంది. రాహుల్‌ గాంధీ సారథ్యంలో సాగుతున్న ఈ యాత్ర ఇప్పటివరకు నాలుగు రాష్ట్రాలు (తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌)లలో పూర్తికాగా ఈరోజు తెలంగాణలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.ఇంకోవైపు, బీసీసీఐ ఎన్నికల అంశంపైనా పవార్‌ స్పందించారు. బీసీసీఐ ఎన్నికలపైనా రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కొన్ని రంగాలపై రాజకీయాలు చేయకూడదని.. అలా చేయడం అవివేకమన్నారు. తాను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గుజరాత్‌ నుంచి నరేంద్ర మోదీ, దిల్లీ నుంచి అరుణ్‌ జైట్లీ, హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి అనురాగ్‌ ఠాకూర్‌ ప్రాతినిధ్యం వహించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. క్రీడాకారులకు సదుపాయాలు కల్పించడమే మన పని అని.. ఇంకేవిూ పట్టించుకోరాదని పవార్‌ హితవు పలికారు. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఔరంగాబాద్‌ పర్యటనపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు పవార్‌ సమాధానాలిచ్చారు. ‘’రైతుల్ని కలిసేందుకు ఉద్ధవ్‌ వెళ్లడం మంచిదే. ఆయన ఆరోగ్యం మెరుగైంది.. విూకు సందేహాలు ఎందుకు? రైతుల సమస్యలను ఆయన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఉంచాలి. రైతులకు మేలు జరిగితే మంచిదే కదా!’’ అని వ్యాఖ్యానించారు.