భారత్‌కు షాకిచ్చిన ట్రంప్‌

– ప్రాధాన్య వాణిజ్య ¬దాను తొలగించాలనే యోచన
– యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యులకు ట్రంప్‌ లేఖ
– ట్రంప్‌ నిర్ణయంతో భారత్‌ ప్రయోజనాలకు భారీ విఘాతం
– డబ్ల్యూటీవో మార్గదర్శకాల మేరకు దిగుమతి పన్ను విధిస్తున్నామన్న భారత్‌
వాషింగ్టన్‌, మార్చి5(జ‌నంసాక్షి) : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ ప్రయోజనాలకు భారీ విఘాతం కలిగించే నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. భారత వస్తువులపై అత్యధిక సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఎలాంటి సుంకాలు లేకుండా భారత్‌ కొన్ని వస్తువులను అమెరికాకు ఎగుమతి చేసేందుకు వీలుగా ఆ దేశానికి ఇస్తున్న ప్రాధాన్యత వాణిజ్య ¬దాను తొలగించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యులకు ట్రంప్‌ లేఖ ద్వారా తెలియజేశారు. ఈ చర్యతో భారత్‌, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ(జీఎస్‌పీ) కింద అమెరికా మార్కెట్లలో భారత్‌కు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నామని, భారత మార్కెట్లలోనూ అమెరికాకు అలాంటి సదుపాయాలు కల్పించాలని కోరామని ట్రంప్‌ తెలిపారు. అయినా భారత్‌ దానిపై స్పష్టమైన హావిూ ఇవ్వట్లేదని, అందుకే భారత్‌కు ప్రాధాన్యత వాణిజ్య ¬దాను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నామని యూఎస్‌ కాంగ్రెస్‌కు రాసిన లేఖల్లో ట్రంప్‌ పేర్కొన్నారు. జీఎస్‌పీ ప్రోగ్రామ్‌ కింద అమెరికా కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాధాన్యత వాణిజ్య ¬దా కల్పిస్తోంది. అందులో భారత్‌ కూడా ఉంది. 2017లో భారత్‌, అమెరికా దేశాల మధ్య వాణిజ్య లోటు 2730 కోట్ల డాలర్లు ఉంది.  ఇపుడున్న ఈ ¬దా కారణంగా దాదాపు 560 కోట్ల డాలర్ల భారత వస్తువులు ఎలాంటి పన్నులు చెల్లించకుండానే అమెరికా మార్కెట్‌లో ప్రవేశిస్తున్నాయి. దీంతో ఇతర దేశాల వస్తువులకన్నా మన దేశాల వస్తువులు అమెరికాలో  చౌకగా లభిస్తున్నాయి. ఈ ¬దా తొలగిస్తే ఇతర దేశాల మాదిరిగానే మన వస్తువులపై కూడా అమెరికా పన్నులు విధిస్తుంది. ఈ కామర్స్‌కు సంబంధించి ఇటీవల భారత్‌ తన నిబంధనలను మార్చింది. దీనిపై అమెరికా కంపెనీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. అమెరికా వస్తువులపై భారత్‌ భారీ స్థాయిలో పన్నులు విధిస్తోందని ట్రంప్‌ పలుమార్లు హెచ్చరించారు. భారత్‌, అమెరికా మధ్య పలుమార్లు తీవ్రస్థాయిలో చర్చలు జరిగాయి. అయినా ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్‌ స్పష్టం చేశారు. భారత మార్కెట్‌లోకి సమాన స్థాయి, సహేతుక స్థాయిలో అమెరికా వస్తువులను అనుమతించాలని అమెరికా డిమాండ్‌ చేస్తోంది. అంటే తక్కువ ఆంక్షలు, తక్కువ పన్నులు వేయమని కోరుతోంది. కాంగ్రెస్‌కు అమెరికా వాణిజ్య విభాగం ఈ మేరకు నోటిఫికేషన్‌ ఇస్తుంది. అమెరికా అధ్యక్షుని సంతకం తరవాత ఈ ఉత్తర్వులు 60 రోజులకు అమల్లోకి వస్తాయి.  మరోవైపు టర్కీకి కూడా ప్రాధాన్యత వాణిజ్య ¬దాను తొలగిస్తున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా టర్కీ ఉందని, అందుకే ¬దాను తొలగిస్తున్నట్లు ట్రంప్‌ తెలిపారు. ఇదిలా ఉంటే ట్రంప్‌ నిర్ణయంపై భారత్‌ స్పందించింది. డబ్ల్యూటీవో మార్గదర్శకాలకు అనుగుణంగానే దిగుమతి పన్ను విధిస్తున్నామని పేర్కొంది.
ట్రంప్‌ నిర్ణయంతో పెద్ద ప్రభావమేవిూ ఉండదు – అనూప్‌ వాధవన్‌
ట్రంప్‌ నిర్ణయంతో మనదేశ ఎగుమతులపై పెద్ద ప్రభావమేవిూ చూపించదని వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్‌ వాధవన్‌ తెలిపారు. సాధారణ ప్రాధాన్యత వ్యవస్థ కింద భారత్‌ 5.6 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేస్తోందని, ఈ ఎగుమతుల వల్ల భారత్‌కు ఏటా కేవలం 190 మిలియన్‌ డాలర్ల
ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. జీఎస్‌పీ తొలగింపుతో భారత ఎగుమతులపై పెద్ద ప్రభావమేవిూ ఉండదని, అంతేగాక భారత్‌, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ఎలాంటి ప్రభావం చూపించదని అనూప్‌ తెలిపారు.