భారత్‌బంద్‌ విజయవంతం


` నిలిచిన రైళ్లు, రవాణా వ్యవస్థ
` సాగుచట్టాల రద్దు వరకు పోరు ఆగదు
` రైతు సంఘాల హెచ్చరిక
దిల్లీ,సెప్టెంబరు 27(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నేడు దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్‌కు అనూహ్య స్పందన లభించిందని సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా పేర్కొంది. పంజాబ్‌, హరియాణా, కేరళ, బిహార్‌ రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అన్ని రకాల వాణిజ్య, వ్యాపార సంస్థలు, మార్కెట్లు, రవాణా వ్యవస్థలు స్తంభించిపోయాయని వెల్లడిరచింది. రాజస్థాన్‌, యూపీ, ఉత్తరాఖండ్‌, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ బంద్‌కు భారీ మద్దతు లభించిందని తెలిపింది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు (10గంటల పాటు) దేశవ్యాప్తంగా బంద్‌ కొనసాగినట్లు పేర్కొంది. 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) చేపట్టిన బంద్‌ ప్రభావం పలు రాష్ట్రాల్లో కనిపించినప్పటికీ.. దిల్లీ, మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల నుంచి మిశ్రమ స్పందన లభించినట్లు కనిపించింది.బంద్‌లో భాగంగా దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కేరళలో ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, ఏఐటీయూసీ కార్యకర్తలు భారీ మానవ హారంతో నిరసన ప్రదర్శన చేపట్టారు. కర్ణాటకలోనూ కార్మిక సంస్థలు మద్దతు తెలపడంతో అక్కడ చాలా చోట్ల బంద్‌ వాతావరణం కనిపించింది. చెన్నైలోనూ అన్నా సలై ప్రాంతంలో భారీ సంఖ్యలో పాల్గొన్న ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీ`గురుగ్రామ్‌ సరిహద్దు వద్ద జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీ చేపట్టడంతో వందల సంఖ్యలో వాహనాలతో భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిరది. పలు రాష్ట్రాల్లో రైల్వే ట్రాకులపై ఆందోళనకు దిగడంతో పలు రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడిరది. దిల్లీ, అంబాలా, ఫిరోజ్‌పూర్‌ డివిజన్లలో నడిచే రైలు సర్వీసులపై తీవ్ర ప్రభావం పడిరది. ఈ బంద్‌కు సంఫీుభావం ప్రకటించిన తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, కేరళ, పంజాబ్‌, రaార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు రైతు సంఘాలకు మద్దతు తెలిపాయి. దేశవ్యాప్తంగా 15 కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు తెలిపినట్లు రైతు సంఘాలు వెల్లడిరచాయి.
యోగీ ప్రభుత్వం విఫలం.. టికాయిత్‌
రైతుల పంటకు కనీస మద్దతు ధర ఇవ్వడంలో యోగీ ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయిత్‌ విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెరకుకు రూ.375 నుంచి 450 పెంచుతామన్న ప్రభుత్వం.. కేవలం రూ.25రూపాయలే పెంచిందని దుయ్యబట్టారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు సంవత్సరం నుంచి ఆందోళనలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగానే ఉన్నట్లు రాకేశ్‌ టికాయిత్‌ మరోసారి పేర్కొన్నారు.
తెలంగాణలోనూ బంద్‌ ప్రశాంతం
బంద్‌ కారణంగా తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హనుమకొండలో వామపక్షాల నేతలు బస్సులను అడ్డుకున్నారు. దీంతో వామపక్ష నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం పలువురు నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రీజియన్‌ పరిధిలో 842 బస్సులు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. మహబూబ్‌నగర్‌ బస్టాండ్‌ వద్ద కాంగ్రెస్‌, వామపక్షాల నేతలు నిరసన తెలిపారు. బస్టాండ్‌ ఎదుట బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో కాంగ్రెస్‌, సీపీఐ,సీపీఎం సహా పలు విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. షాద్‌నగర్‌ డిపో నుంచి బస్సులు రాకుండా గేటు వద్ద నేతలు అడ్డుకున్నారు. అత్యవసర సేవలకు బంద్‌ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది. సాయంత్రం 4 గంటల వరకు భారత్‌ బంద్‌ కొనసాగనుంది.