భారత్‌లో ప్రవేశించిన ఒమిక్రాన్‌


` దక్షిణాఫ్రికా నుంచి కర్నాటకకు వచ్చిన ఇద్దరిలో గుర్తింపు
` క్వారంటైన్‌కు తరలించిన అధికారులు
` ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక
` మాస్కులు ధరించడం..వ్యాక్సిన్‌ తీసుకోవడం తప్పనిసరి
` విూడియా సమావేశంలో వివరించిన కేంద్ర కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌
న్యూఢల్లీి,డిసెంబరు 2(జనంసాక్షి): తీవ్ర కలకలం రేపుతున్న కోవిడ్‌`19 వైరస్‌ కొత్త రూపాంతరం ఒమైక్రాన్‌ భారత్‌లో ప్రవేశించింది. కర్ణాటకలో ఇద్దరికి ఇది సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ధృవీకరించింది. వేగంగా వ్యాపించే ఈ కేసులు మన దేశంలో నమోదవడం ఇదే తొలిసారి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ గురువారం విూడియా సమావేశంలో మాట్లాడుతూ, ఒమైక్రాన్‌ వేరియంట్‌ కేసులు రెండు మన దేశంలో నమోదయ్యాయని చెప్పారు. ఈ రెండు కేసులు కర్ణాటకలోనే ఉన్నట్లు తెలిపారు. 46 సంవత్సరాలు, 66 ఏళ్ళు వయసుగల ఇద్దరు పురుషులు ఈ వైరస్‌ బాధితులని తెలిపారు. వీరిలో ఒకరు నవంబరు 11న, మరొకరు నవంబరు 20న దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు తెలిపారు. అయితే ఒమైక్రాన్‌ లక్షణాలు మన దేశంలో ఇప్పటి వరకు మరీ అంత తీవ్రంగా లేవని చెప్పారు. ఈ వైరస్‌కు సంబంధించిన కేసులన్నిటిలోనూ చాలా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటి వరకు మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వెల్లడైన ఈ కేసుల్లో తీవ్రమైన లక్షణాలు కనిపించలేదని తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలపై అధ్యయనం జరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిందన్నారు. ఒమైక్రాన్‌ రూపాంతరాన్ని మొదట దక్షిణాఫ్రికాలోని బోట్స్‌వానాలో గుర్తించారు. ఆ తర్వాత ఇది సుమారు 10 దేశాలకు వ్యాపించింది. ఇది మరింత విస్తరించకుండా మన దేశం కఠిన చర్యలు అమలు చేస్తోంది. అంతర్జాతీయ ప్రయాణికులపై దృష్టి పెట్టింది. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ ట్రేస్‌ అయినట్లు జీనోమ్‌ స్వీక్వెనింగ్‌ పరీక్షలో వెల్లడైంది. ఒమిక్రాన్‌ నిర్దారణ కావడంతో వీరిద్దరిని క్వారంటైన్‌కు తరలించామని ఆయన చెప్పారు. దీంతో ఈ వేరియెంట్‌ మనదేశంలో మరింత ప్రబలే ప్రమాదం ఉందని.. ప్రజలు తప్పనిసరిగా కోవిడ్‌ నిబంధనలను పాటించాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. కరోనా డెల్టా వేరియంట్‌ కంటే ఒమిక్రాన్‌ వేరియంట్‌ 5 రెట్లు ఎక్కువ ప్రమాదకరమని.. ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందని భయపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)ను ఉటంకిస్తూ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ వైరస్‌ 29 దేశాలకు విస్తరించిందని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ఆందోళన వైవిధ్యాల విభాగంలో ఉంచింది. గత నెల రోజులుగా దేశంలో కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇప్పుడు మహారాష్ట్ర, కేరళ రాష్టాల్ల్రో 10 వేలకు పైగా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇది దేశంలోని మొత్తం కేసులలో 55 శాతం అని చెప్పుకొచ్చారు. జనాభాలో 49 శాతం మంది రెండు డోస్‌లు వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఈ కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. దేశవ్యాప్తంగా 49 శాతం వయోజనులకు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి అయ్యిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రెండవ డోసు తీసుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ పక్రియను వేగవంతం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. యురోపియన్‌ దేశాల్లో కోవిడ్‌ కేసుల సంఖ్య మళ్లీ పెరిగినట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలో దాదాపు 70 శాతం కేసులు అక్కడే ఉన్నట్లు ఆయన వెల్లడిరచారు. గడిచిన వారంలో కేవలం యూరోప్‌లోనే 70 శాతం కేసులు నమోదు అయినట్లు లవ్‌ అగర్వాల్‌ చెప్పారు.