భారత కమ్యూనిస్టు పార్టీ( సిపిఐ) 98వ వ్యవస్థాపక దినోత్సవం జయప్రదం చేయండి పల్లా దేవేందర్ రెడ్డి సీపీఐజిల్లాసహయ కార్యదర్శి

కొండమల్లేపల్లి డిసెంబర్ 14 జనం సాక్షి న్యూస్
డిసెంబర్ 26వ తేదీన సీపీఐ పార్టీ 98వ వ్యవస్థాపక దినోత్సవం జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుదవారం కొండమల్లేపల్లి లో జరిగిన మండల పార్టీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ
భూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు, త్యాగాలతో ఏర్పడినది భారత కమ్యూనిస్టు పార్టీ అని దున్నేవాడిదే భూమి అనే నినాదంతో దేశవ్యాప్తంగా భూ పోరాటలు నిర్వహించి వేలాది ఎకరాలు భూ పంపిణీ చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకె దక్కిందన్నారు.ప్రజలు, రైతులు, కార్మికుల పక్షాన నిలబడి ఎన్నో సమరశీల పోరాటాలు చేస్తూ అనేక త్యాగాల చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై బలమైన ఉద్యమాలు నిర్వహించాలని అన్నారు. దున్నేవాడిదే భూమి కావాలని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపి వేలాది మంది మృత వీరుల త్యాగం తో లక్షలాది ఎకరాల భూమి పేదలకు పంచిన చరిత్ర ఎర్రజెండాదే అని అన్నారు.
ప్రజా సమస్యలపై సిపిఐ నిరంతరం పోరాడుతుందని అన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న పాలకుల విధానాలు తిప్పికొట్టాలని అన్నారు. ఉద్యోగాల కల్పన కోసం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నేటికీ అవి అమలు చేయకపోవడం అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే ,ఎల్ ఐ సి,బిఎస్ఎన్ఎల్,ఎయిర్ఇండియా, విశాఖ ఉక్కు ను కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నారని ,దేశాన్ని అధోగతి పాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం విధానాలను తుప్పికొట్టాలని అన్నారు. అదేవిధంగా బిజెపి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలు కోసం పోరాటాలు నిర్వహించాలని, ప్రజా సమస్యలే అజెండాగా భారత కమ్యూనిస్టు పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ 98వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 26న గ్రామ గ్రామ పార్టీ జెండాలు తోరణాలతో అలంకరించి పార్టీ జెండాను ఎగురవేయాలని ఆయన అన్నారు .
ఈ సమావేశానికి శేఖర చారీ అధ్యక్షత వహించిగా సీపీఐ మండల కార్యదర్శి గుమ్ముకొండ వెంకటేశ్వర్ రెడ్డి,కళ్ళు చరణ్ రెడ్డి, బానావత్ సొంలా,కురాకుల వెంకటయ్య,వంపు ధర్మయ్య,సుంకయ్య తదితరులు పాల్గొన్నారు