భారత సబ్ మెరైన్ల సమాచారం లీక్

024ap-main2aభారత నౌకాదళానికి చెందిన అతి సున్నితమైన విషయాలు బహిర్గతమయ్యాయి. రక్షణశాఖ ఎంక్వైరీ మొదలుపెట్టింది. నేవీ కోసం ఫ్రెంచ్ డిఫెన్స్ షిప్ బిల్డింగ్ కంపెనీ డీసీఎన్ఎస్ ద్వారా ఆరు స్కార్పియన్ క్లాస్ సబ్ మరైన్లు తయారు చేయిస్తోంది కేంద్రం. వాటికి సంబంధించిన 22 వేల 400 పేజీల రహస్య సమాచారం లీకైందని ‘ది ఆస్ట్రేలియన్’ న్యూస్ పేపర్ బయటపెట్టింది. హ్యాకింగ్ వల్లే ఇన్ఫర్మేషన్ లీక్ అయి ఉండొచ్చన్నారు డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పారికర్. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని నేవీ చీఫ్ ను ఆదేశించారు. సమాచారం లీక్ కావడం దేశ భధ్రతకు ప్రమాదకరమని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.