భారీ నష్టాలు మూటగట్టుకున్న మార్కెట్లు 

ముంబయి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను మిగిల్చాయి. అమ్మకాల ఒత్తడి పెరగడంతో నిప్టీ 11,600కు దిగువకు పడిపోగా.. సెన్సెక్స్‌ దాదాపు 500 పాయింట్లు నష్టపోయింది. ఉదయం సెన్సెక్స్‌ ఎ/-లాట్‌గానే ప్రారంభమైనప్పటికీ..  వెంటనే నష్టాల్లోకి జారుకొని తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.  చివరికి 495 పాయింట్ల నష్టంతో 38,645 వద్ద స్థిరపడింది. అటు నిప్టీ ఆరంభం నుంచి నష్టాల్లోనే కొనసాగి చివరకు 158 పాయింట్ల నష్టంతో 11,594 వద్ద ముగిసింది. ఐటీ తప్ప మిగతా రంగాల షేర్లు నష్టాలను నమోదు చేశాయి. ఇండియాబుల్స్‌ హౌజింగ్‌, యస్‌బ్యాంక్‌, బీపీసీఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐవోసీ షోర్లు నష్టాలను నమోదు చేయగా.. భారతీ ఎయిర్‌టెల్‌, విప్రో, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల బాట పట్టాయి.