భూముల ధరలకు రెక్కలొచ్చాయి..

ఖమ్మం: నాడు బీడు భూములు.. నేడు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. దీంతో భూముల రేట్లకు రెక్కలొచ్చేశాయి. అన్నదాతల మొహంలో సంతోషం కనిపిస్తోంది. దీనికంతటికీ కారణం భక్త రామదాసు ప్రాజెక్టేనంటున్నారు రైతులు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలం ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉండేది. ఇప్పుడు బంగారు పంటలు పండించే మాగాణిగా మారిపోయింది. అప్పట్లో సాగునీటి వసతి లేక రైతులు అల్లాడిపోయారు. నేడు పరిస్థితి మారిపోయింది. భక్త రామదాసు ఎత్తిపోతల పథకం రైతుల కన్నీళ్లు తుడవడమే కాదు.. సిరుల పంట కురిపిస్తోంది. దీంతో రైతన్న ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూడండి.