భూ ప్రక్షాళన భేష్‌

– సవరించిన రికార్డుల ఆధారంగానే రైతులకు సాయం

– సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 22,(జనంసాక్షి):రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం లక్షానికి అనుగుణంగా, అనుకున్న ప్రకారం జరుగుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు చాలా చిత్తశుద్ధితో, అంకితభావంతో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం నిర్వహిస్తున్నారని, భూమి యాజమాన్య హక్కులపై స్పష్టత వస్తుండడం రైతులకు ఎంతో ఊరట కలుగుతున్నదని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఎండనకా, వాననకా కష్టపడుతూ భూ రికార్డులను సరిచేస్తున్న రెవెన్యూ అధికారులు, సిబ్బందికి నగదు ప్రోత్సాహం అందివ్వనున్నట్లు కూడా సిఎం ప్రకటించారు. గత 15వ తేదీన ప్రారంభమయిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం మొదటి వారం రోజుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ప్రగతి భవన్లో సవిూక్ష నిర్వహించారు. ల్యాండ్‌ ప్యూరిఫికేషన్‌ మిషన్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ వాకాటి కరుణ ముఖ్యమంత్రికి కార్యక్రమం జరుగుతున్న విధానాన్ని వివరించారు.568 రెవెన్యూ మండలాల్లోని 10,875 గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం తీసుకున్నారు. దీనికోసం 1468 బృందాలు ఏర్పాటయ్యాయి. 1.78 కోట్ల సంఖ్యలో ఉన్న సర్వే నెంబర్లలోని 75.54 లక్షల ఖాతాల్లో ఉన్న 2.45 కోట్ల ఎకరాల భూమికి సంబంధించిన రికార్డుల క్షాళన జరపాలని నిర్ణయించారు. మొదటి విడతలో 1,252 గ్రామాల్లో రికార్డుల పరిశీలన,ప్రక్షాళన జరుగుతున్నది. ఈ గ్రామాల్లో 30.04 లక్షల ఎకరాల భూమి ఉంది. వీటిలో 11.55 లక్షల ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. వీటిలో 9.48 లక్షల (82.10 శాతం) ఎకరాల భూములకు సంబంధించి రైతుల సమ్మతితో యాజమాన్య హక్కులపై స్పష్టత ఇచ్చారు. ఏ భూమి ఎవరిదో తేల్చారు. పార్ట్‌ ‘ఎ’లో వివాదాల్లేని భూముల రికార్డులను సరిచేయాలని నిర్ణయించుకున్నారు. పార్ట్‌ ‘ఎ’లో 82 శాతానికి పైగా భూములపై స్పష్టత రావడం డ?) విషయం. మిగిలిన భూములకు సంబంధించి కూడా ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. వాటిని పార్ట్‌ ‘బి’ కార్యక్రమంగా చేపట్టున్నారు. పార్ట్‌ ‘ఎ’ కార్యక్రమంలోనే కొన్ని గ్రామాల్లో వందకు వందశాతం కూడా రికార్డుల ప్రక్షాళన పూర్తయింది. వంద శాతం వివాద రహితంగానే భూమి యాజమాన్య హక్కులపై స్పష్టత వచ్చింది. డిసెంబర్‌ 31 వరకు పార్ట్‌ ‘ఎ”కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత పార్ట్‌ ‘బి’ కార్యక్రమం తర్వాత చేపడతారు. 82 శాతానికి పైగా భూములపై స్పష్టత వస్తుందని అంచనా. గెట్టు వివాదాలు, వారసత్వ సమస్యలు పరిష్కరిస్తే పార్ట్‌ ‘బి’ ద్వారా కూడా మరో పది శాతానికి పైగానే భూములపై వస్తుంది. అన్ని జిల్లాల కలెక్టర్లు స్వయంగా కార్యక్రమాన్ని పర్యవేకిస్తున్నారు. హైదరాబాద్‌ ?? పాటు, జిల్లాల్లో కూడా భూ రికార్డుల ప్రక్షాళన, నవీకరణ కోసం ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ లు ఏర్పాటు చేశారు. కంట్రోల్‌ రూమ్‌ నెంబరుకు ఫోన్‌ చేస్తే వివరాలు చెబుతున్నారు. రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించడానికి సోషల్‌ విూడియాను కూడా ఉపయోగించుకుంటున్నారు. ల్యాండ్‌ ప్యూరిఫికేషన్‌ కార్యక్రమంపై ప్రత్యేక ఫేస్‌ బుక్‌ తెరుస్తున్నారు. సందేహాలు నివృత్తి చేడయానికి కరపత్రాలు, బుక్‌ లెట్లు పంచుతున్నారు. ఒక్కో బృందానికి సగటున 9 గ్రామాల చొప్పున కేటాయించారు. డ????, గ్రామంలో సగటున పది రోజుల పాటు అధికారుల బృందం ఉండి, భూ రికార్డులను పరిశీలిస్తున్నది. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా కేవలం రైతుల భూములను కాకుండా గ్రామం పరిధిలోని అన్ని ప్రభుత్వ భూముల లెక్కలు కూడా తీస్తున్నారు. దీంతో గ్రామం పరిధిలో ఏ భూమి ఎవరి ఆధీనంలో ఉందో, దేనికి ఎవరు యజమానో తేలుతున్నది. విదేశాల్లో ఉన్న ఎన్‌.ఆర్‌.ఐ.లు కూడా అక్కడే ఉండి తమ భూమి రికార్డులు పంపిస్తే, పరిశీలించి యాజమాన్య హక్కులపై స్పష్టత ఇచ్చే విధంగా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలు నాలుగైదు రోజుల్లో ఖరారవుతాయి. ”భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చాలా బాగా జరుగుతున్నది. ఇది రైతులకు ఎంతో ప్రయోజనకరమైన కార్యక్రమం. ఎన్నో ఏళ్ల నుంచి పరిష్కారం కాని సమస్యలు ఓ కొలిక్కి వస్తున్నాయి. భూమి యాజమాన్యంపై స్పష్టత రావడం రైతులకు గొప్ప ఊరటనిచ్చే అంశం. వారసత్వం హక్కులను ఖచ్చితంగా నిర్ధారించడం, సాదా బైనామాలపై జరిగిన క్రయ విక్రయాలను క్రమబద్దీకరించడం, పేరు మార్పిడీ చేయడం లాంటి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ?నీ?? ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఎంతో శ్రమ కో డ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. ఉద్యోగులందరికీ నా హృదయ పూర్వక అభినందనలు. ఇంటింటికీ వెళ్లి, ప్రతీ రికార్డునూ పరిశీలించి రెవెన్యూ సిబ్బంది పడుతున్న కష్టం వెలకట్టలేనిది. ఎండనకా, వాననకా గ్రామాల్లో తిరుగుతూ ఎంతో శ్రమ పడుతున్నారు. దీనివల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతున్నది. ఇంత కష్టం చేస్తున్న రెవెన్యూ ఉద్యోగుల సేవలను ప్రభుత్వం తప్పక గుర్తిస్తుంది. వారికి ప్రత్యేక నగదు ప్రోత్సాహం అందిస్తాం. గ్రామాల్లో సగటున 82 శాతానికి పైగా భూముల విషయంలో ఇప్పటికే స్పష్టత రావడం చాలా మంచి పరిణామం. ఇంత పెద్ద మొత్తంలో స్పష్టత రావడం హర్షించదగ్గది. వివాదాలు లేకుండానే భూమిపై స్పష్టత వస్తున్నది. కొన్ని గ్రామాల్లో వందకు వంద శాతం స్పష్టత వస్తున్నట్లు సమాచారం అందుతున్నది. పార్ట్‌ బి కార్యక్రమంలో మరిన్ని భూములపై స్పష్టత వస్తుంది. ఐదు శాతానికి అటు ఇటుగా ఉన్న భూముల విషయంలో కోర్టు కేసులు ఉన్నందున వాటిని, కోర్టు తీర్పులకు లోబడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. పార్ట్‌ ఎ కార్యక్రమం పూర్తయిన వెంటనే స్పష్టత వచ్చిన భూములకు సంబంధించి కొత్త పాస్‌ పుస్తకాలు అందిస్తాం. సవరించిన రికార్డుల ఆధారంగానే రైతులకు వ్యవసాయ పెట్టుబడి అందించే కార్యక్రమం అమలు చేస్తాం. మొదటి విడత ఎకరానికి నాలుగు వేల చొప్పున మే 15లోగా రైతుల ఖాతాలో వేస్తాం. అక్టోబర్‌ 15 లోగా రెండో విడత పెట్టుబడి కింద ఎకరాకు నాలుగు వేలు బ్యాంకు ఖాతాలో నేరుగా వేస్తాం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ల్యాండ్‌ ప్యూరిఫికేషన్‌ మిషన్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ వాకాటి కరుణ, సిఎంఓ అధికారులు ఎస్‌. నర్సింగ్‌ రావు, స్మితా సభర్వాల్‌, భూపాల్‌ రెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.