మండుటెండల్లోనూ అద్భుత కళాఖండాల సృష్టి

ఎండలను సైతం లెక్కచేయని శిల్పుల తదేక దీక్ష
ఇదో అవకాశంగా సుందర నిర్మాణం కోసం వారి తపన
శరవేగంగా యాదాద్రి పునర్నిర్మాణ పనులు
యాదాద్రి,మార్చి29(జ‌నంసాక్షి): అనేక ప్రత్యేకతలతో దేశంలోనే అత్యద్భుత దేవాలయంగా యాదాద్రిని తీర్చిదిద్దాలని సంకల్పించిన  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎండలు దంచుతున్నా నిర్మాణ కార్యక్రామల్లో ఎలాంటి అపశృతి లేకుండా సాగిస్తున్నారు. సిఎం కెసిఆర్‌ ఆదేవాల మేరకు సకాలంలో అంటే ఈ దసరా నాటికి పూర్తి చేయాలన్న సంలక్పం వారిని ముందుకు సాగేలా చేస్తోంది. దేశంలో కనీవినీ ఎరుగుని రీతిలో చోళుల తరవాత ఓ మహాద్భుత ఆలయ నిర్మాణం త్వరలోనే ప్రజలకు సాక్షాత్కారం కానుంది. ఇక్కడ పనిచేస్తున్న శిల్పులు, కూలీలు కూడా ఇదేదో తమ జీవనభృతికి చేస్తున్న పనిలాగా కాకుండా తమకు లభించిన అవకాశంగా గ్రహించి ముందుకు సాగుతున్నారు. అందుకే  నిర్మాణ పనుల్లో ప్రతీ అంశంపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.  ఆలయంలో నిర్మిస్తున్న శిలలకు ప్రత్యేకత ఉంది. వీటిని ఎంపిక చేసిన శిలలతో కళాఖండాలుగా మలస్తున్నారు. కృష్ణ పురుష శిలలకు 2500 ఏండ్లపాటు ఆయుష్షు ఉంటుందని చెన్నై ఐఐటీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం శిల్పాల మన్నికపై నియమించిన కమిటీ తేల్చింది. 12 వేల చదరుపు అడుగుల వైశాల్యంతో కూడిన బ్ర¬్మత్సవ ఫ్లోరింగ్‌ పనులు జరుగుతున్నాయి. యాదాద్రి పశ్చిమభాగంలో నిర్మాణం కానున్న ఏడంతస్తుల రాజగోపురం పనులు ఇక్కడే జరుగుతున్నాయి. దీనికి అవసరమైన శిల్పాలు రూపుదిద్దుకుంటున్నాయి. నాలుగైదు అంతస్తుల రాజగోపురాలు యాదాద్రిలో నిర్మాణం కానుండగా మూడు రాజగోపురాలకు అవసరమైన శిల్పాలు ఇక్కడే రూపుదిద్దుకుంటున్నాయి. ఒక్కో గోపురానికి 42 వర్గాల శిల్పాలు అవసరమవుతాయి. ఒక్కో శిల్పం ఒక్కో సుదర రూపంగా శిల్పి ఉలినుంచి అవతరిస్తోంది.  గుంటూరు జిల్లాలోని కమ్మవారిపాలెం క్వారీ నుంచి సేకరించే శిలలతో రాజగోపురాలు తయారవుతున్నాయి. ఐదంతస్తుల రాజగోపురం, బంగారుతాపడం చేయనున్న శ్రీవారి దివ్య విమానగోపురానికి అవసరమైన శిల్పాలు తయారవుతున్నాయి. రోజూ లక్షమందికి పైగా భక్తులొచ్చినా.. దర్శనం, వసతికి అనుగుణంగా సకల సౌకర్యాలు కల్పించేలా నిర్మాణం ఊందుకుంది. నరసింహస్వామి 32 అవతారాలనూ యాదాద్రిలో ప్రతిష్ఠించబోతున్నారు. స్వామి వారి కీర్తనలను ప్రాచుర్యంలోకి తేనున్నారు. యాదాద్రి అభివృద్ధి పనులపై  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సవిూక్ష సమావేశం నిర్వహించినప్పుడు పలు సూచనలు చేశారు.  యాదాద్రికి ఇటీవల భక్తుల సంఖ్య బాగా పెరిగింది. సెలవు దినాల్లో, ప్రత్యేక సందర్భాల్లో రోజుకు లక్ష మంది వరకు వస్తున్నారు. మాఘం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఫాల్గుణ మాసాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కొత్త ఆలయం నిర్మాణం తర్వాత భక్తుల సంఖ్య రెట్టింపు అవుతుంది. ఎలాంటి ఇబ్బందులు, ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలి. యాదాద్రికి నలువైపులా రహదారులను నిర్మించే పనులూ అంతే వేగంగా సాగుతున్నాయి.  నాలుగు వరసల రింగ్‌ రోడ్లు, ప్రదక్షిణ మార్గాలను ఏర్పాటుచేస్తున్నారు.  ప్రధాన గుట్టకు ముందుండే గుట్టపై అన్ని సౌకర్యాలతో కూడిన కాటేజీలను నిర్మించే కార్యక్రమాలు ఊపందుకున్నాయి,  ఈశాన్య భాగంలో 13 ఎకరాల విస్తీర్ణంలోని గుట్టపై చేపట్టిన రాష్ట్రపతి నివాస గదుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయనున్నారు. ఆగమ, వైదిక శాస్త్రం ప్రకారం వైటీడీఏ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. యాదాద్రి సన్నిధిలోనే భక్తులకు శివ కేశవులను దర్శించుకునే భాగ్యం కలగనుంది. పుష్కరిణికి అభిముఖంగా దక్షిణం వైపున దాదాపు ముప్పావు ఎకరం విస్తీర్ణంలో పునర్నిర్మాణం జరపనున్నారు. ప్రధానాలయాన్ని యథావిధిగా ఉంచుతూ, రాజగోపురం, ప్రాకారాలను పూర్తిగా రాతి కట్టడాలతో శిల్పకళా శోభితంగా నిర్మించనున్నారు. రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోనే పార్వతీదేవి, గణపతి, ఆంజనేయ స్వామి ఆలయాలను కొత్తగా నిర్మిస్తారు. నవగ్రహ మండపాన్ని పునర్నిర్మించడంతోపాటు రాహుకేతు మండపాలను ఏర్పాటు చేయడానికి డిజైన్లు రూపొందించారు. శిల నిర్మాణాలతో సాగే ఆలయ ప్రాకార సాలాహారం లో అష్టాదశ శక్తిపీఠాలకు చెందిన దేవతల విగ్రహాలు, వెలుపల ద్వాదశ జ్యోతిర్లింగాల మూర్తులతో ఒకే ప్రాంగణంలో అటు అష్టాదశ శక్తి పీఠాలు.. ఇటు ద్వాదశ జ్యోతిర్లింగాలను సందర్శించిన ఆధ్యాత్మిక అనుభూతి కలిగించే రీతిలో డిజైన చేశారు. కాకతీయుల కాలంనాటి ఆలయ నిర్మాణ శైలిలో శివాలయాన్ని నిర్మించడానికి డిజైన్లను రూపొందించారు.ఆధ్యాత్మిక, ప్రకృతి రమణీయ, పర్యాటక ప్రాముఖ్యత ఉట్టిపడేలా దేవాలయ నిర్మాణం సాగాలన్న ఆదేశాల మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్షేత్రంలోని వివిధ ప్రదేశాలకు దైవనామానాలను పెట్టడం ద్వారా భక్తులు విధిగా దైవనామస్మరణ చేస్తారు. ఆలయ ప్రాంగణమంతా దైవ స్తోత్రాలు, కీర్తనలు వినిపించేలా ఏర్పాట్లు చేయబోతున్నారు. యాదాద్రి నర్సింహస్వామి ప్రత్యేక కీర్తనలుండేవి. ప్రత్యేక
వాగ్గేయకారులు ఉండేవారు. ఆ కీర్తనలను, వాగ్గేయకారులను గుర్తించి వెలుగులోకి తేబోతున్నారు.  కొండపైన నిద్రించి స్వామివారికి సేవ చేయాలనుకునేవారికి, మండల దీక్ష తీసుకున్న వారికి ప్రధాన ఆలయ సవిూప ప్రాంతంలో ప్రత్యేక వసతి ఏర్పాటు చేస్తారు. దేవాలయ కార్యాలయ సముదాయం, అధికారుల నివాస సముదాయం నిర్మించాలి. దైవారాధనకు సమయపాలన పాటించాలి కాబట్టి అర్చకులకు దేవాలయ సవిూపంలోనే నివాస సదుపాయం ఉండాలి. యాదాద్రికి సవిూపంలో ఉన్న 85 ఎకరాల అటవీ భూమిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.