మంత్రుల సుడిగాలి ప్రచారం

– పురపోరులో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌,జనవరి 19(జనంసాక్షి):గులాబీ అభ్యర్థుల తరఫున పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మంత్రులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కారు గుర్తుకే ఓటు వేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ.. ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.కాంగ్రెస్‌ పార్టీ గల్లీ లో లేదు.. ఢిల్లీ లో లేదన్నారు మంత్రి హరీష్‌ రావు. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డి పల్లిలోని పలు వార్డుల్లో మంత్రి హరీష్‌ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి ప్రచారం నిర్వహించారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో 35 కోట్లతో అభివృద్ధి చేశామని హరీష్‌ రావు తెలిపారు. అటు అవిూన్‌ పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.అలంపూర్‌ ను అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి నిరంజన్‌ రెడ్డి. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా? జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ లో మంత్రి నిరంజన్‌ రెడ్డి నిర్వహించిన రోడ్‌ షోకు అపూర్వ స్పందన లభించింది. ఎంపీ రాములు, ఎమ్మెల్యే అబ్రహం ఈ రోడ్‌ షోలో పాల్గొన్నారు.మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లాలోని మేడ్చల్‌ మున్సిపాలిటీలో గులాబీ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. 8 వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రామస్వామికి మద్దతుగా మంత్రి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పీర్జాదిగూడ కార్పొరేషన్‌ పలు డివిజన్లలో ఎమ్మెల్యే భేతి సుభాష్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జక్క వెంకట్‌ రెడ్డి ప్రచారం నిర్వహించారు. అటు బోడుప్పల్‌ మున్సిపాలిటీలోని 17వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంద సంజీవరెడ్డి ప్రచారం నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డితో పాటు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో కలిసి బొమ్మక్‌ చిత్తారి నగర్‌, న్యూ మారుతి నగర్‌ కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. మరోవైపు కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 17 వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కౌకుంట్ల చంద్రారెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. కొంపల్లి మున్సిపాలిటీలో రెండో వార్డు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి సన్న కవిత శ్రీశైలం యాదవ్‌ డోర్‌టు డోర్‌ క్యాంపెయినింగ్‌ చేశారు.మహబూబాబాద్‌ పట్టణంలోని 23వ వార్డులో ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్యేలు శంకర్‌ నాయక్‌, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్‌ పట్టణం అభివృద్ధి చెందాలంటే.. కారు గుర్తుకు ఓటు వేసి టిఆర్‌ ఎస్‌ అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ¬రెత్తిపోతోంది. 15, 16 వార్డుల్లో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ కుమార్‌ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకే ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో ఎన్నికల ప్రచారం ఉధృతంగాసాగుతోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే కోరుకంటిచందర్‌.. ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 14,15,16,17,18 డివిజన్లలో ఆయన.. పార్టీ కేడర్‌తో కలిసి క్యాంపెయినింగ్‌ చేశారు. నల్లగొండ మున్సిపాలిటిలో ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 48 వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ.. పట్టణంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థించారు. అటు సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా 24,25,26 వార్డుల్లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు. చిట్యాల మున్సిపల్‌ ఒకటి, 10 వ వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రచారం నిర్వహించారు. మిర్యాలగూడ 40వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి స్రవంతి తరఫున.. ఎమ్మెల్యే భాస్కర్‌ రావు ప్రచారం నిర్వహించారు. అటు హాలియా మున్సిపాలిటీ 7, 8, 9 వార్డుల్లో ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మరోవైపు కోదాడ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్యయాదవ్‌ ప్రచారం నిర్వహించారు. మోత్కూరు మున్సిపాలిటీలోని 7వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సావిత్రి మెగారెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. జనగామలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా మండలి చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్మెన్‌ పాగాల సంపత్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరాములు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకే ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అటు భూపాలపల్లి మున్సిపాలిటీ ఐదవ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజేత తరపున ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి ప్రచారం నిర్వహించారు.వికారాబాద్‌ జిల్లా పరిగి మున్సిపాలిటీలో.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున జెడ్పీ ఛైర్‌ పర్సన్‌ సునీతా మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. 7,8,15 వార్డుల్లో తిరుగుతూ.. కారు గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మున్సిపాలిటీలోని 26 వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీత దేశాయ్‌ ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున.. ఎమ్మెల్యేలు ప్రకాశ్‌ గౌడ్‌, మాగంటి గోపినాథ్‌ ఇంటింటి ప్రచారం చేశారు. కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ 12వ డివిజన్‌ లో గులాబీ అభ్యర్థి కొలన్‌ నీలా గోపాల్‌ రెడ్డి గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. 16వ డివిజన్‌ లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆగం పాండు ముదిరాజ్‌ ఇంటింటి ప్రచారం చేశారు. అటు 19వ డివిజన్‌ లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాసాని సుధాకర్‌ ముదిరాజ్‌ క్యాంపెయినింగ్‌ చేశారు.జవహర్‌ నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 15వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మేకల కావ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆనంద్‌ నగర్‌, శాంతినగర్‌ కాలనీల్లో ఆమె విస్తృత క్యాంపెయినింగ్‌ చేపట్టారు. ప్రచారానికి వచ్చిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి జనం మంగళహారతులతో స్వాగతం పలికారు.కామారెడ్డి మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్‌ విస్తృత ప్రచారం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ.. కారు గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరారు. పట్టణంలోని ఇందిరా నగర్‌, డ్రైవర్స్‌ కాలని, బీడీ వర్కర్స్‌ కాలని, అయ్యప్ప నగర్‌ కాలనీలో కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు.ఆదిలాబాద్‌ పట్టణంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే జోగు రామన్న ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రతి కాలనీలో రోడ్డు సౌకర్యం, మౌళిక వసతులు కల్పించామన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నగరంలో ఇప్పటికే రూ.35కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల్లో 15మంది టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.మహబూబ్‌నగర్‌ పట్టణంలోని పలు వార్డుల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి ప్రచారం చేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 6 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని కోరారు.ప్రజా సంక్షేమం కోసం,ప్రజల అవసరాలను తీర్చే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి రామగుండం కార్పొరేషన్‌ పై గులాబీ జెండా ఎగుర వేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.