మట్టి గణపతులకే ప్రాధాన్యం ఇవ్వాలి

విధిగా హరితహారంలో పాల్గొనాలి
మంటపాల నిర్వాహకులకు ఎస్పీ సూచన
ఆదిలాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను ప్రతిష్టించాలని, అందకు మంటప నిర్వహకులు ముందుకు రావాలని ఎస్పీ విష్ణువారియర్‌ సూచించారు. మట్టిగణపతులను కూడా మనం సూచించిన విధంగా తయారు చేయించుకోవచ్చన్నారు. సమయం ఉన్నందున ఇప్పటి నుంచే ఆ దిశగా చర్య తీసుకోవాలన్నారు. అలాగే మంటప నిర్వాహకులు పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అలాగే నిబంధనల మేరకే గణెళిశ్‌ మండపాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. గణెళిశ్‌ మండపాలను ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. మట్టి వినాయకుల ప్రతిమలను ప్రతిష్ఠించాలని తెలిపారు. పీవోపీ, కెమికల్‌ రంగుల గణెళిశ్‌ విగ్రహాలను ప్రతిష్ఠించి వాగులు, చెరువులు, నదుల్లో నిమజ్జనం చేస్తే పర్యావరణానికి హానీ కలుగుతుందన్నారు. ప్రతి మండపం వద్ద ఈ ఏడాది మట్టి వినాయకులను ప్రతిష్ఠించుకోవాలని సూచించారు. గణెళిశ్‌ నవరాత్రి ఉత్సవాలకు భారీ పోలీసు బందోబస్తు ఉంటుందని తెలిపారు. ప్రతి మండపం వద్ద నిర్వహణ కమిటీ సభ్యులు ఒకరు రాత్రి తప్పని సరిగా ఉండాలని సూచించారు. గణెళిశ్‌, బక్రీద్‌ ఉత్సవాలను జిల్లా ప్రజలందరూ శాంతియుతంగా జరుపుకొని శాంతి సంకేతాన్ని ఇవ్వాలని పిలుపునిచ్చారు. మండపాల వద్ద ప్రభుత్వం నిషేధించిన పాటలను పెట్టవద్దని సూచించారు. జిల్లా కేంద్రంలో కొన్ని గణెళిశ్‌ మండపాలను భక్తులు దర్శించడానికి వస్తారని, మండపాల నిర్వాహకులు భారీ కేడ్లు, ప్రత్యేక ఏర్పాట్లను చేసుకోవాలని తెలిపారు. ప్రతి మండపం వద్ద నిర్వాహకులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా గణెళిశ్‌ మండపాలను ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దని సూచించారు.