మత్స్యకారులకు అండగా ప్రభుత్వం

సబ్సిడీపై పనిముట్లు,పరికరాలు

జగిత్యాల,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): మత్స్యకారుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఉచితంగా చేపపిల్లను పంపిణీ చేయడం ద్వారా ఉపాధి కల్పిస్తుందని జిల్లా మత్స్యశాఖ అధికారి అన్నారు. ఇటీవల రోళ్లవాగు ప్రాజెక్ట్‌లో 4 లక్షల 60 వేల చేపపిల్లను వదిలిపెట్టారు. రాష్ట్రంలోని మత్స్యకారులందరికీ ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను అందిస్తూ వారి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత ఇప్పటి వరకు అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. పోయాయి కానీ మత్స్యకారులను పట్టించుకున్న పాపన పోలేదు..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మత్స్యకారుల కష్టసుఖాలు తెలుసుకోని వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో సవిూకృత మత్స్యఅభివృద్ధి పథకం తీసుకొచ్చి సబ్సిడీపై వాహనాలను, పరికరాలను అందజేస్తున్నారని మత్స్యకార సంఘాల నేతలు అన్నారు. సవిూకృత మత్స్యఅభివృద్ధి పథకంలో భాగంగా జిల్లాలోని మత్స్యకారులకు 75 శాతం సబ్సిడీతో ద్విచక్ర వాహనాలు, టాటా ఎస్‌ వాహనాలు, వివిధ చేపల వేటకు అవసరమయ్యే పనిముట్లు, పరికరాలతోపాటు మహిళా మత్స్యకార సంఘాలకు రుణాలను అందిస్తోందని అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్‌ అన్ని కుల వృత్తుల వారికి చేయూత అందించారన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను అందజేస్తున్నామన్నారు. మత్స్యకారులు బాగు కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని అందుకు తాము రుణపడి ఉన్నామని అన్నారు. ఉచితంగా చేపపిల్లలను అందివ్వడంతో పాటు సబ్సిడీపై వాహనాలు, పనిముట్లు అందజేస్తుందన్నారు. గత ప్రభుత్వాలు కుల వృత్తులను అసలుకే పట్టించుకోలేదన్నారు.