మత్స్య ఉత్పత్తుల ఆహార విక్రయ మేళా(ఫిష్‌ ఫెస్టివల్‌) ను జయప్రదం చేయండి‌.

నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:రేపటి నుండి 3రోజుల పాటు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మత్స్య ఉత్పత్తుల ఆహార విక్రయ మేళా(ఫిష్‌ ఫెస్టివల్‌) ను జయప్రదం చేయాలని జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల చీఫ్ ప్రమోటర్వాకిటిఆంజనేయులుఅన్నారు.బుదవారం కొల్లాపూర్ పట్టణంలోని గంగమ్మ దేవాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8నుండి 10వ తేదీ వరకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఆధ్వర్యంలో ఊరూరా చేపల వంటల పండుగ కార్యక్రమాన్ని మత్స్యకారుల పనిముట్లు వలలు కోడిమేలు శిఖ్యాలు తో ప్రదర్శిస్తూ, గంగమ్మ తల్లికి బోనాలు ఊరేగింపుగా చెరువు కట్ట పైకి వెళ్లి వనభోజనాలు చేసుకొని గంగమ్మ తల్లి మొక్కును చెల్లించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు.ఈ ఫిష్ ఫెస్టివల్ మేళా లో చేప ఆహార విక్రయాల మెలకువలను వివరించడం జరుగుతుందని అన్నారు.చేపల వంటకాలైన చేపల వేపుడు, రొయ్యల వేపుడు, చేప బిర్యాని, రొయ్య బిర్యాని, చేపల పకోడి, చేపల పులుసు, చేపల మంచూరియా అందుబాటులో ఉంటుందని తెలిపారు.కావునా జిల్లా ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని చేప వంటలను విక్రయించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ సొసైటీ అధ్యక్షులు ఉరి సుధాకర్, గువ్వల కురుమయ్య , రాముడు,సూరారి వెంకటయ్య, పెబ్బేటి మల్లేష్, కోలరాముడు, కురుమయ్య పాల్గొన్నారు.