మద్దతుధరల కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు

రైతులు సద్వినయోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే

భద్రాద్రికొత్తగూడెం,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించి దళారీల వ్యవస్థను రూపుమాపి, వారికి మద్దతు ధర అందించాలన్న ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. దళారుల వలన రైతులు పండించిన ధాన్యాన్ని తగిన ధర పొందలేకపోతున్న రైతులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులకు మద్దతు ధర లభించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. జిల్లాలో వివిధ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, వాటిలో ముఖ్యంగా రైతుబంధు, రైతుభీమా పథకం అత్యంత ప్రధానమైనవని పేర్కొన్నారు. కిన్నెరసాని ద్వారా పదివేల ఎకరాలకు నీరందిస్తున్నామని, రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ధాన్యం సేకరణ కొరకు రైతులకు గన్నీ బ్యాగులు సకాలంలో అందించాలన్నారు. రైతులకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. ధాన్యం విక్రయించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రతలను జేసీ వెంక రైతులకు వివరించారు.