మనం నిలబడాలంటే భాషలపై పట్టు సాధించాల్సిందే!

మనభాషను బతికించుకుంటూనే… ప్రపంచంలో నిలబడాలంటే ఆంగ్లం,మిందీ భాషలపై పట్టు సాధించు కోవాల్సిందే. అందుకు కసరత్తులు తప్పవు. ఇతర భాషలను నేర్చుకోవడం అన్నది అనివార్యమైన అంశంగానే గుర్తించాలి. ఎపిలో ఆంగ్ల మాధ్యం ప్రవేశ పెట్టడంతో నానాయాగీ చేయాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్‌ విూడియం స్కూళ్లకు సామాన్య తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. తమ పిల్లలను వారు ప్రైవేట్‌ రంగంలో ఉన్న ఇంగ్లీష్‌ విూడియం స్కూళ్లకు పంపడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. పేద తల్లిదండ్డులు కూడా తమ పిల్లలతో మవ్మిూడాడీ అనిపించుకోవాలని తపనపడుతున్నారు. తమ పిల్లలు ఇంగ్లీషులో మా/-టలాడితే ముచ్చట పడుతున్నారు. ఇది సామాజికంగా వచ్చిన మార్పుగా చూడాలి. కేవలం పెద్దవర్గాలకే పరిమితం అయిన ఇంగ్లీష్‌ విూడియం పేదలకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి ఒకరో ఇద్దరో విదేశాల్లో చదువుకుంటున్నారు. దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్న ప్రస్తుత తరుణంలో పిల్లలో తమకు తాముగా కెరీర్‌ చూసుకుని విదేశాల్లో స్థిరపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ దశలో ఇటీవల ఎపి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంవత్సరంలో ఒకటో తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను తెలుగు విూడియంను రద్దు చేసి ఇంగ్లీషు విూడియంలో నిర్వహిస్తామని జి.వో విడుదల చేసింది. ఈ విషయం విూద రాష్ట్రంలో తీవ్ర చర్చ ప్రారంభమైంది. తెలుగును బోధనా భాషగా రద్దు చేయడం సరికాదని, తెలుగుతో పాటుగా ఇంగ్లీషు మాధ్యమాన్ని కూడా కొనసాగిస్తే సరిపోతుందని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు. అయితే, వారిపై కొంతమంది కుల సంఘాల నాయకులు తీవ్రమైన దాడి చేస్తున్నారు. దళితులు ఇంగ్లీషు నేర్చుకోవడం ఇష్టం లేకనే ఇంగ్లీషులో బోధనను వ్యతిరేకిస్తునారని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇంగ్లీషుతోనే అభివృద్ధి చెందుతారనే భ్రమతోనే వీరు ఇలా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ తెలుగును విస్మరించమని ఎవరూ చెప్పడం లేదు. క్లాస్‌ రూముల్లో ఇంగ్లీష్‌తో పాటు మాతృభాష తెలుగును కూడా బోధిస్తే వచ్చే ప్రమాదం లేదు. అభివృద్ధి చెందిన ఏ దేశమైనా వారి దేశ భాష తోనే అభివృద్ధి చెందింది తప్ప ఇంగ్లీషు భాష ద్వారా మాత్రం కాదు. అయితే ప్రపంచం ఇప్పుడు ఇంగ్లీష్‌ లేకుండా ముందుకు సాగడం లేదు. అందుకే చైనా, జపాన్‌,రష్యా, జర్మన్‌ లాంటి దేశాల ప్రజలు కూడా ఇప్పుడు ఆంగ్లంపై పట్టు సాధించే పనిలో పడ్డాయి. అక్కడి విద్యార్థులు తమ భాషతో పాటు ఆంగ్లం కోసం కసరత్తు చేస్తున్నాయి. చైనా మాతృభాష లోనే అభివృద్ధి సాధిస్తోంది తప్ప ఇంగ్లీషు ద్వారా మాత్రం కాదు. జర్మనీ, జపాన్‌ దేశాలు అభివృద్ధిలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇదంతా మాతృభాష ద్వారానే సాధించాయి. అయితే అవి ఇంగ్లీష్‌ నేర్చుకోఏక పోవడం కారణంగా వెనకబడ్డామని గుర్తించాయి. అందుకే ఇప్పుడా దేశాల్లో ఇంగ్లీష్‌ కోసం క్యూ కడుతున్నారు. కానీ 12 కోట్ల జనాభాతో జపాన్‌ ప్రపంచంలోనే అగ్ర దేశంగా ఎలా అభివృద్ధి చెందిందని వాదించే వారూ ఉన్నారు. ఇంగ్లీషు లేకపోతే అభివృద్ధి ఆగిపోదనే వారు ఉన్నారు. జర్మనీ, జపాన్‌, ఫ్రాన్స్‌ దేశాలు ఎందుకు అభివృద్ధి చెందినట్లని అనేవారూ ఉన్నారు. ఇంజనీరింగ్‌, వైద్య విద్య, ఇతర పాఠ్య గ్రంథాలను తెలుగులోకి అనువదిస్తే ఇంగ్లీషుతో పని ఏముంది? కావున అభివృద్ధికి , భాషకు ముడి పెట్టడం సరికాదనే వారు ఉన్నారు. అయినా భాషను కమ్యూనికేషన్‌ కోసం మాత్రం నేర్చుకోవడంలో తప్పులేదు. శాస్త్ర విజ్ఞానం వల్ల కంప్యూటర్‌ రంగం ఎంతో అభివృద్ధి సాధిస్తున్నది. ఇంటర్నెట్‌, స్మార్ట్‌ ఫోన్‌లు వచ్చిన తరువాత శాస్త్ర సాంకేతిక అభివృద్ధి మన ముంగిట్లోకి వచ్చింది. ప్రపంచం అంతా ఒక కుగ్రామంగా మారి సమాచారం మొత్తం అందుబాటులోకి వచ్చింది. గూగుల్‌, యూ ట్యూబ్‌, వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ లాంటివి అందుబాటు లోకి వచ్చిన తరువాత క్షణాల్లో కోరిన సమాచారం మన ముందుకు వస్తున్నది. ఇంగ్లీష్‌ మాత్రమే కాక మన దేశ భాషలలో అనేక భాషలు ఇంటర్నెట్‌ ద్వారా తెలుగు ఫాంట్‌ను రూపొందించాయి. అయినా ఎక్కడో వెలితి కనిపిస్తూనే ఉంది. ఇంగ్లీష్‌లో కమ్యూనికేట్‌ చేసినంతగా మాతృభాషలో చేయలేకపోతున్నాం. తెలుగునే మడికట్టుకుని నేర్చుకుంటే ఫారిన్‌ వెళలే విద్యార్థుల గతేం కాను. మాతృ భాషను మరవకుండా ఇంగ్లీష్‌ నేర్చుకోవాలన్న సంకల్పం బలపడాలి. మరింతగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర పాలకులు ఇతోధికంగా కృషి చేయాల్సింది. దేశంలో నేటికీ నూటికి దాదాపు యాభై మంది వ్యవసాయ కూలీలుగా, దళితులుగా జీవనం సాగిస్తున్నారు. కష్టపడ దామన్నా, పని దొరకక కడుపు నిండా తిండి లేక పిల్లలకు సరైన పోషకాహారం పెట్టలేని స్థితిలో బిడ్డల చదువుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రామాల్లోని అట్టడుగున ఉన్న దళితులు ఎంతగా వెనుకబడి వున్నారు. వీరికి విద్యతో పాటు ఉన్నత ఉద్యోగాలు అవసరమే. వీరు తమ బిడ్డలకు ఉన్నత చదువులకి ఇంగ్లీషు అవసరం కాబట్టి ఇంగ్లీషు కావాలని కోరుతున్నారు. అభివృద్ధిలో అందరూ అమెరికాను చూస్తుంటారు. అదే విధంగా మన తెలుగు భాషను కూడా అభివృద్ధి చేయడానికి పూనుకోవాలి. ఏదీ స్థిరంగా ఉండదు. నిరంతరం మార్పుకు లోనౌతూ అభివృద్ధి వైపే ప్రయాణి స్తుంది. ఇందుకు భాష మినహాయింపు కాదు. అందువల్ల ఆంగ్లంతో పాటు హిందీ, తెలుగు భాషలను కూడా నేర్చుకోవాల్సిందే.