మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎమ్మెల్యే జడ్పీ చైర్ పర్సన్,

 

 

 

 

 

కలెక్టర్మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎమ్మెల్యే జడ్పీ చైర్ పర్సన్, కలెక్టర్

జహీరాబాద్ ఫిబ్రవరి 1( జనం సాక్షి). న్యాల్కల్ మండలంలోని మెటల్ కుంట గ్రామంలో 85 లక్షల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటీ మాణిక్ రావు, జడ్పీ ఛైర్పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్ లు పాఠశాలను ప్రారంభించారు, అనంతరం జడ్పిటిసి స్వప్న భాస్కర్ లతో కలిసి మొక్కలు నాటారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను పటించుకొనే నాదులు లేరని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్య కోసం కొన్ని వెయ్యిల కోట్ల ప్రత్యేక నిధులను కేటాయిస్తూ, ఇటీవల 7 వెయ్యిల కోట్లకు పైగా నిధులతో మన ఊరు మన బడి కార్యక్రమన్ని తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే మణిక్ రావు అన్నారు, న్యాల్కల్ మండల జడ్పిటిసి స్వప్న భాస్కర్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను మన ఊరు మన బడి పథకంలో చేర్చి ఈ ఏడాది నుండి ఇంగ్లీష్ మీడియాం విద్యతో పాటు మౌలిక  సదుపాయాలు అదనపు తరగతి గదులు, మంచినీటి సౌకర్యం, విద్యుత్తు మూత్రశాలలు, మరుగుదొడ్లు, కిచేన్ షెడ్లు, డైనింగ్ హాల్లు,  ప్రహరీ గోడలు,  డిజిటల్ క్లాస్ రూమ్స్ ల ఏర్పాటుకోసం లక్షల బడ్జెట్ను పాఠశాల విద్యా కమిటీ ఖాతాల్లో జమ చేసిందని, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య తో పాటు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం వారానికి మూడు కోడి గుడ్లు ఉచితంగా పుస్తకాలు దుస్తులు అందజేస్తూ  తెలంగాణ ప్రభుత్వం  విద్యార్థుల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని జడ్పిటిసి స్వప్న భాస్కర్ ప్రశంసించారు..  కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ శరత్, జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, జడ్పి సీఈఓ ఎల్లయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, మండల ఎంపిపి అంజమ్మ,  బీఆర్‌ఎస్‌ పార్టీ న్యాల్కల్ మండల అధ్యక్షుడు డప్పుర్ రవీందర్, మాజీ మండల అధ్యక్షుడు నర్సింహ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మోహియోద్దీన్‌, సీనియర్ నాయకులు రాజెందర్ రెడ్డి,పాండురంగ రెడ్డి న్యాయవాది, సర్పంచులు, ఎంపిటిసిలు, ఉప సర్పంచులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, గ్రామాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.