మన ఊరు-మన బడి మొదటి విడతలో గుడితండ ప్రాథమిక పాఠశాల ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే

 

 

 

 

 

రమావత్ రవీంద్ర కుమార్కొండమల్లేపల్లి ఫిబ్రవరి 1 (జనంసాక్షి) న్యూస్ :
మన ఊరు మన బడి పథకంతో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాలలను బలోపేతం చేస్తుందని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు బుధవారం కొండమల్లేపల్లి మండలం గుడి తండాలో రూ.6.03లక్షలతో పాఠశాలలో మన ఊరు-మన బడి మొదటి విడత కార్యక్రమానికి ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, ఎంపీపీ దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు.అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా రంగ రక్షణకు శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి పేద మధ్య తరగతి వర్గాల పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తుందన్నారు గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు మన ఊరు మన బడి పథకం తో ఈ ఏడాది నుండి ఇంగ్లీష్ మీడియాం విద్యతో పాటు మౌలిక సదుపాయాలు అదనపు తరగతి గదులు, మంచినీటి సౌకర్యం, విద్యుత్తు మూత్రశాలలు, మరుగుదొడ్లు, కిచేన్ షెడ్లు, డైనింగ్ హాల్లు, ప్రహరీ గోడలు, డిజిటల్ క్లాస్ రూమ్స్ ల ఏర్పాటుకోసం లక్షల బడ్జెట్ను పాఠశాల విద్యా కమిటీ ఖాతాల్లో జమ చేసింది అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య తో పాటు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం వారానికి మూడు కోడి గుడ్లు ఉచితంగా పుస్తకాలు దుస్తులు అందజేస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు వసికర్ల రమేష్ నూతన పాఠశాల కోసం వారు చేసిన సేవలను కొనియాడి అభినందించారు ఈ కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షుడు కేసాని లింగా రెడ్డి,బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమావత్ దస్రు నాయక్,మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, మండల విద్యాశాఖాధికారి ఎ. మాతృ నాయక్ , ఎంపీడీవో బాలరాజు రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వసికర్ల రమేష్ ,పాఠశాల SMC ఛైర్మెన్ నేనావత్ కృష్ణ, వైస్ చైర్మన్ జ్యోతి బాలు నాయక్ సర్పంచ్ రమావత్ అంజలి రాంబాబు నాయక్, ఎంపీటీసీ రజిత కన్వర్, మాజీ సర్పంచ్ మధు నాయక్, నేనావత్ శంకర్ నాయక్, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు