మరుగుదొడ్ల నిర్మాణంలో అలసత్వం తగదు

జనగామ,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): బహిరంగ మలవిసర్జనను పారదోలి సంపూర్ణ స్వచ్ఛమైన పల్లెలుగా తీర్చిద్దిందేం దుకు మరుగుదొడ్ల నిర్మాణం వేగంగా చేపట్టాలని ఆర్డీవో ఎల్‌. రమేశ్‌ సంబంధిత సిబ్బందికి తెలియ పరిచారు. వివిధ గ్రామాలలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ఇప్పటి వరకు కూడ పనులు చేబట్టని కుటుంబాలకు వచ్చే ప్రభుత్వ పథకాలను నేటి నుండే నిలిపి వేయాలని అన్నారు. మరుగుదొడ్ల నిర్మా ణంపై శనివారం మండలంలోని చిన్నపెండ్యాల, రాజవరం, చిలుపూరు, వెంకటాద్రిపేట, మల్కాపూరు, లింగంపల్లి గ్రామాలను అయన సందర్శించి గ్రామ రెవెన్యూ అధికారులు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లతో మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వీధుల్లో తిరుగుతూ ఓడీఎఫ్‌ కింద నిర్మించిన మరుగుదొడ్లను పరిశీలించారు. గ్రామాలలో మరుగుదొడ్ల నిర్మాణాలను నిర్మించడంలో అలసత్వం వహించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలలో ఈ నెల 31లోపు 100శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. అవసరమనుకుంటే ప్రజలకు మరుగుదొడ్ల నిర్మాణం చేబట్టుకోకుంటే కల్గే అనార్ధల పై వివరించాలని లేదంటే ప్రభుత్వ పథకాలను కట్‌ చేసి మరుగుదొడ్డి నిర్మాణం పూర్తి చేశాకే మరల పథకాలను అమలు పరుచాలని వీఆర్వోలకు సూచించారు.