మరో ఇద్దరు బయటికొచ్చారు

– గృహలో మరో ఇద్దరు
– వారిని రక్షించేందుకు రిస్క్యూ టీం ప్రయత్నాలు
థాయిలాండ్‌, జులై10(జ‌నం సాక్షి ) : థాయిలాండ్‌ థామ్‌ లువాంగ్‌ గుహ నుంచి మరో ఇద్దరిని బయటికి తెచ్చారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10 గంటలకు వరదనీటితో నిండిన గుహలోకి దిగిన 19మంది డైవర్ల బృందం నాలుగు గంటలపాటు శ్రమించి ఇద్దరిని స్టెచ్చర్ల్రపై బయటికి తీసుకొచ్చింది. దీంతో ఇప్పటి వరకు గుహలో చిక్కుపడిన 12 మంది వైల్డ్‌ బోర్స్‌ ఫుట్‌ బాల్‌ క్లబ్‌ పిల్లల్లో 10 మంది బయటికి వచ్చినట్లయింది. మొదటి రోజు 11 గంటలు, రెండో రోజు 9 గంటలు పట్టిన సమయం ఇప్పుడు బాగా తగ్గించగలిగామని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న అధికారులు చెప్పారు. మిగిలిన ఇద్దరు పిల్లలు, వాళ్ల కోచ్‌ను త్వరగా బయటికి తీసుకొస్తామని సహాయ బృంద సభ్యులు ధీమా వ్యక్తం చేశారు. అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతుండటంతో కొండలపై నుంచి జారిపడుతున్న నీటిని వెంటవెంటనే మోటార్లతో తోడి పోస్తున్నారు. గత వారం రోజుల క్రితం 12మంది ఫుట్‌బాల్‌ క్లబ్‌ పిల్లలు గృహలో చిక్కుకున్నారు. వీరిలో కోచ్‌ కూడా ఉన్నారు. గృహలో లోతు భాగంలో వీరు చిక్కుకుపోవటంతో సహాయచర్యలు ముమ్మరంగా చేశారు. ఆదివారంనలుగురు చిన్నారులను బయటకు తీసుకొచ్చిన రిస్క్యూ టీం, సోమవారం మరో నలుగురికిని బయటకు తీసుకొచ్చింది. మంగళవారం ఉదయం మరో ఇద్దరి చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. కాగా గృహంలో కోచ్‌, ఓ చిన్నారి ఉన్నారు. వారిని కూడా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే బయటకు వచ్చిన చిన్నారులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిని వారం రోజుల పాటు వైద్యు లపర్యవేక్షణలో ఉంచి ఎలాంటి ఇబ్బందులు లేకుంటే తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.